French Open 2023: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలనం.. ఫైనల్‌కు చేరిన కరోలినా

9 Jun, 2023 08:34 IST|Sakshi

పారిస్‌: అందరి అంచనాలను తారుమారు చేసి చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి కరోలినా ముకోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్‌ ముకోవా 7–6 (7/5), 6–7 (5/7), 7–5తో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌)పై సంచలన విజయం సాధించింది.

తన కెరీర్‌లో 17వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న 26 ఏళ్ల ముకోవా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సబలెంకాతో 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్‌ పోరులో నిర్ణాయక మూడో సెట్‌లో ముకోవా 2–5 స్కోరు వద్ద తన సరీ్వస్‌లో 30–40 పాయింట్ల వద్ద ఓటమి ముంగిట నిలిచింది.

ఈ కీలక తరుణంలో ముకోవా ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌తో 40–40తో సమం చేసింది. అనంతరం సబలెంకా రెండు అనవసర తప్పిదాలు చేయడంతో ముకోవా తన సరీ్వస్‌ను నిలబెట్టుకుంది. అనంతరం సబలెంకా సరీవస్‌ను బ్రేక్‌ చేసి, మళ్లీ తన సరీవస్‌ను కాపాడుకున్న ముకోవా స్కోరును 5–5తో సమం చేసింది.

11వ గేమ్‌లో సబలెంకా సర్వీస్‌ను మళ్లీ బ్రేక్‌ చేసిన ముకోవా 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్, టాప్‌ సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) 6–2, 7–6 (9/7) తో 14వ సీడ్‌ బీత్రిజ్‌ హదాద్‌ మయా (బ్రెజిల్‌)పై గెలిచి మూడోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. 2020, 2022లలో విజేతగా నిలిచిన స్వియాటెక్‌ శనివారం జరిగే ఫైనల్లో ముకోవాతో తలపడుతుంది.
చదవండిWTC Final: ఆసీస్‌ బౌలర్‌ సూపర్‌ డెలివరీ.. దెబ్బకు గిల్‌కు ప్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు