ప్రెస్​మీట్ వివాదం.. ఒసాకాకు ఝలక్​

31 May, 2021 09:50 IST|Sakshi

పారిస్​: జపనీస్​ ​స్టార్ టెన్నిస్​​ ప్లేయర్​ నయోమి ఒసాకా చెప్పినట్లే చేసింది. ఫ్రెంచ్​ టోర్నీలో భాగంగా మ్యాచ్​ తర్వాత ప్రెస్​మీట్​లో పాల్గొనకుండా వెళ్లిపోయింది. దీంతో మ్యాచ్ రిఫరీ ఆమెకు ఫైన్​ విధించడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే టోర్నీ నుంచి డిస్​క్వాలిఫై చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, రూల్స్​ తెలిసి కూడా ప్రెస్​మీట్​ను బాయ్​కాట్​ చేస్తున్నట్లు ఒసాకా ఇది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఫ్రెంచ్​ ఓపెన్ టోర్నీ​లో భాగంగా ఆదివారం రొమేనియన్​ ప్లేయర్​ ప్యాట్రికాతో మ్యాచ్​ తర్వాత(ఒసాకానే గెలిచింది) ఆమె మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయింది. దీంతో ఈ వరల్డ్​ నెంబర్ టు ర్యాంకర్​కి​ 15 వేల డాలర్ల జరిమానా విధించారు. అంతేకాదు మళ్లీ ఇలా జరిగితే అనర్హత వేటు తప్పదని మ్యాచ్​ రిఫరీ రొనాల్డ్ గారోస్​ హెచ్చరించారు. 23 ఏళ్ల వయసున్న ఒసాకా నాలుగుసార్లు గ్రాండ్​స్లామ్​ టైటిల్స్​ గెల్చుకోవడంతో పాటు.. స్పోర్ట్స్​లో అత్యధికంగా సంపాదించే ఫిమేల్ ప్లేయర్ కూడా.: 

చూడండి: నయోమి ఒసాకా ఫొటోలు
  
మీరేం స్పెషల్ కాదు
ఇక ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభానికి ముందే నయోమి ఒసాకా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లను బాధపెట్టే విధంగా మీడియా అడిగే ప్రశ్నలు తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని చెబుతూ ప్రెస్​మీట్​ను బాయ్​కాట్ చేసింది. గ్రాండ్‌స్లామ్‌ రూల్స్​ ప్రకారం..  మీడియా సమావేశాన్ని ఎగ్గొడితే 20 వేల డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) దాకా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా ఆమె బాయ్​కాట్ చేయడం నిర్వాహకులకు మరింత కోపం తెప్పించింది. దీంతో మీరేం స్పెషల్ కాదని, నిబంధనలను​ ఆటగాళ్లందరికీ వర్తిస్తాయని పేర్కొంటూ ‘వింబుల్డన్​, ఫ్రెంఛ్​ ఓపెన్​, ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్​​ నిర్వాహ కమిటీలు సంయుక్తంగా ఒక స్టేట్​మెంట్ కూడా రిలీజ్ చేశారు. అయితే మ్యాచ్​ ముగిశాక ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఆమె మీడియాతో ఇంటెరాక్ట్ కావడం విశేషం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు