స్వియాటెక్‌ @ 17

13 Oct, 2020 04:39 IST|Sakshi

37 స్థానాలు పురోగతి సాధించిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌

పారిస్‌: అందరి అంచనాలను తారుమారు చేసి ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచిన పోలాండ్‌ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్‌ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ముందు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 54వ స్థానంలో ఉన్న 19 ఏళ్ల స్వియాటెక్‌ ‘గ్రాండ్‌’ విజయంతో 37 స్థానాలు పురోగతి సాధించి కెరీర్‌ బెస్ట్‌ 17వ ర్యాంక్‌కు చేరుకుంది. రన్నరప్‌గా నిలిచిన సోఫియా కెనిన్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి చేరింది. యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... సిమోనా హలెప్‌ రెండో ర్యాంక్‌లో (రొమేనియా), నయోమి ఒసాకా (జపాన్‌) మూడో ర్యాంక్‌లో ఉన్నారు.  

పురుషుల ర్యాంకింగ్స్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ జొకోవిచ్‌ (సెర్బియా) నంబర్‌వన్‌ స్థానంలోనే కొనసాగుతుండగా... విజేత రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌ చేరిన డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా) 14వ ర్యాంక్‌ నుంచి కెరీర్‌ బెస్ట్‌ 8వ ర్యాంక్‌కు చేరుకోగా... ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా) తొలిసారి పదో ర్యాంక్‌ను అందుకున్నాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు