Asia cup 2022: 'కోహ్లి మళ్లీ విఫలమయ్యాడు.. ఇదీ ఒక ఇన్నింగ్సేనా'

30 Aug, 2022 08:31 IST|Sakshi
PC: NDTV

ఆసియాకప్‌-2022లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. అయితే గత కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు.

దాయాదుల పోరులో 34 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 35 పరుగులు చేసి భారత విజయంలో తమ వంతు ప్రాత్ర పోషించాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాతో కలిసి సంయుక్తంగా భారత తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ముఖ్యంగా భారత టాప్‌ ఆర్డర్‌లో కోహ్లి తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.

కాగా కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఎంతో ఆతృతగా ఎదురు చేసిన అభిమానుల్లో ఈ ఇన్నింగ్స్‌ కాస్త జోష్‌ నిపింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్ కనేరియా మాత్రం కోహ్లి ఫామ్‌పై ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
మళ్లీ విఫలమయ్యాడు!
యూట్యూబ్‌ ఛానల్‌లో కనేరియా మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి విరాట్‌ కోహ్లిపైనే ఉండేది. అతడు మళ్లీ విఫలమయ్యాడు. అతడు తన ఇన్నింగ్స్‌ ఆరంభంలో బంతులను ఎదర్కొవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా సార్లు బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుంది. కేఎల్‌ రాహుల్‌ కూడా దురదృష్టవశాత్తూ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తాకి బౌల్డ్ అయ్యాడు.

అయితే కోహ్లి మాత్రం అదృష్టవంతుడు. ఎందుకంటే అతడు ఎదర్కొన్న రెండో బంతికే పెవిలియన్‌కు చేరాల్సింది. కోహ్లి ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ఫఖర్ జమాన్ జారవిడిచడంతో బతికిపోయాడు. అతడు తన ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక మంచి షాట్‌ ఆడాడు. అతడు ఇంకా పరుగులు సాధించాల్సి ఉంది. ఇదేం అంత గొప్ప ఇన్నింగ్స్‌ కాదు. ఇక అఖరిగా కోహ్లి లెఫ్ట్‌ ఆర్మ్‌ స్సిన్నర్‌కు ఎక్స్‌ట్రా-కవర్‌ దిశగా ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు.

అతడు షాట్‌లు బాగా ఆడుతున్నాడు. అయితే గతంలో కోహ్లి.. సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఆడుతున్నప్పడు ఇదే షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ కోల్పోయాడు. ఆనంతరం కోహ్లికి ఆటువంటి షాట్‌ ఆడకుండా ఉండమని సచిన్‌  సలహా ఇచ్చాడని నాకు ఒకరు చెప్పారు. మళ్లీ ఇప్పుడు కోహ్లి అదే తప్పు చేశాడు అని పేర్కొన్నాడు.
చదవండి: Asia cup 2022: అప్పుడు స్ట్రెచర్‌పై అలా.. ఇప్పుడు పాకిస్తాన్‌పై చేలరేగి! శభాష్‌ హార్దిక్‌

మరిన్ని వార్తలు