ODI World Cup 2023: 'జడేజా, చాహల్‌కు నో ఛాన్స్‌.. వరల్డ్ కప్‌కి ఆ నలుగురు స్పిన్నర్లే బెస్ట్‌'

13 Jan, 2023 17:22 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌ సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే వరుసగా రెండు వన్డేలు గెలిచిన భారత్‌.. 2-0 తేడాతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ సొంతం చేసుకుంది. ఇక సిరీస్‌లో కామెం‍టేటర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌.. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరుపున బరిలోకి దిగే నలుగురు స్పిన్నర్లరను ఎంచుకున్నాడు. కాగా ఈ ఏడాది భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. 

గంభీర్‌ స్టార్‌ స్పోర్ట్‌ షోలో మాట్లాడుతూ.. "ప్రపంచకప్‌లో మణికట్టు స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌కు కచ్చితంగా చోటు ఇవ్వాలి. అక్షర్‌ గత కొన్ని సిరీస్‌ల నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. అదే విధంగా స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో ఉండాలి. ఇక కుల్దీప్‌ యాదవ్‌కు స్వదేశంలో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. భారత్‌లో అతడు బంతితో మ్యాజిక్‌ చేయగలడు.

కాబట్టి కుల్దీప్‌ కూడా ప్రపంచకప్‌ భారత జట్టులో అవకాశం ఇవ్వాలి. ఇక ఆఖరిగా యువ లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ని జట్టులోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. రవి ప్రస్తుతం భారత్‌ సన్నాహాకాల్లో లేనప్పటికీ.. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది" అని పేర్కొన్నాడు. కాగా భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చాహల్‌కు గంభీర్‌ ఎంపిక చేయకపోవడం గమానార్హం.
చదవండి: Virat Kohli: 'సచిన్‌ సాధించిన ఆ రికార్డును కోహ్లి సాధించలేడు'

మరిన్ని వార్తలు