ఇర్ఫాన్‌తో ప్రేమలో ఉన్నపుడు గంభీర్‌ మిస్డ్‌కాల్స్‌ ఇచ్చేవాడు.. మా బ్రేకప్‌ తర్వాత: టాలీవుడ్‌ నటి సంచలన వ్యాఖ్యలు

1 Dec, 2023 17:48 IST|Sakshi
ఇర్ఫాన్‌ పఠాన్‌తో దిగిన ఫొటోను పంచుకున్న పాయల్‌ (PC: Payal Ghosh X)

Payal Ghosh Viral Comments On Irfan Pathan- Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, గౌతం గంభీర్‌లను ఉద్దేశించి నటి పాయల్‌ ఘోష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇర్ఫాన్‌తో తను ప్రేమలో ఉన్నపుడు.. గంభీర్‌ తనకు తరచూ మిస్డ్‌ కాల్స్‌ ఇస్తూ ఉండేవాడంటూ క్రీడావర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారారు.

ఊసరవెళ్లి వంటి బడా సినిమాలో
మంచు మనోజ్‌ హీరోగా నటించిన ‘ప్రయాణం’ సినిమాతో చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన కలకత్తా బ్యూటీ పాయల్‌ ఘోష్‌. ఆ తర్వాత తెలుగులో జూ. ఎన్టీఆర్‌ ‘ఊసరవెళ్లి’ వంటి  పలు చిత్రాల్లో అదృష్టం పరీక్షించుకున్నారు ఈ బెంగాలీ నటి. తర్వాత బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. అయితే, సినిమాల కంటే సంచలన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నామె.

బాలీవుడ్‌ దర్శకుడిపై ఆరోపణలు
గతంలో.. బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించిన ఆమె.. అప్పట్లో ఓ సూసైడ్‌ నోట్‌ షేర్‌ చేసి తన అభిమానులను ఆందోళనకు గురిచేశారు. ఇక క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి తరచుగా మాట్లాడే పాయల్‌ ఘోష్‌.. వన్డే ప్రపంచకప్‌-2023 నుంచి క్రికెటర్ల గురించి తన సోషల్‌ మీడియా అకౌంట్లలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.

షమీ ‘ఇంగ్లిష్‌’ గురించి సెటైర్లు
భారత్‌ వేదికగా వరల్డ్‌కప్‌-2023లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ గురించి పాయల్‌ అప్పట్లో ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. మ్యాచ్‌ అనంతరం షమీ కేవలం హిందీలో మాత్రమే మాట్లాడటాన్ని ఉద్దేశించి.. ‘‘షమీ నువ్వు నీ ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకో.. నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని పాయల్‌ వ్యంగ్యస్త్రాలు సంధించారు.

ఇర్ఫాన్‌తో ప్రేమలో​ ఉన్నపుడు గంభీర్‌ అలా
దీంతో షమీ ఫ్యాన్స్‌ ఆమెపై ఫైర్‌ అయ్యారు. తాజాగా మరో ఇద్దరు మాజీ క్రికెటర్‌ స్టార్లను ఉద్దేశిస్తూ పాయల్‌ చేసిన పోస్టులు సంచలనంగా మారాయి. ‘‘గౌతం గంభీర్‌ గారు నాకు తరచూ మిస్డ్‌కాల్స్‌ ఇచ్చేవారు. ఈ విషయం ఇర్ఫాన్‌ పఠాన్‌కు బాగా తెలుసు. ఎందుకంటే అతడు నా ఫోన్‌ కాల్స్‌ మొత్తం చెక్‌ చేసేవాడు. 

హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా ఉన్నపుడే
ఈ విషయాన్ని యూసఫ్‌ భాయ్‌(ఇర్ఫాన్‌ అన్న), హార్దిక్‌, కృనాల్‌ పాండ్యా​ సమక్షంలో అతడే స్వయంగా నాకు చెప్పాడు. పుణెలో బరోడా జట్టు దేశవాళీ మ్యాచ్‌ జరుగుతున్నపుడు ఇర్ఫాన్‌ను కలవడానికి వెళ్లినపుడు.. అతడు నా ఫోన్‌ చెక్‌ చేసినట్లు తెలిపాడు.

ఇర్ఫాన్‌ని తప్ప ఎవరినీ ప్రేమించలేదు
అయితే, మా బ్రేకప్‌ జరిగిన తర్వాత నేను అనారోగ్యం పాలయ్యాను. ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాను. నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి అతడే.. ఇర్ఫాన్‌ తర్వాత నేనెవరినీ ప్రేమించలేదు’’ అని పాయల్‌ ఘోష్‌ శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్‌ పఠాన్‌తో దిగిన సెల్ఫీని ఆమె షేర్‌ చేశారు.

అటెన్షన్‌ సీకర్‌ అంటూ ట్రోల్స్‌
కాగా పాయల్‌ వ్యాఖ్యలపై అటు ఇర్ఫాన్‌ పఠాన్‌ గానీ.. ఇటు గంభీర్‌ గానీ ఇంతవరకు స్పందించలేదు. అయితే, వారి అభిమానులు మాత్రం.. ‘‘కేవలం వార్తల్లో నిలవడానికి మాత్రమే.. అందరి చూపును తన వైపునకు తిప్పుకొనేందుకే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా పాయల్‌ ఘోష్‌ జూ.ఎన్టీఆర్‌, అతడి అభిమానులను.. దక్షిణాది ప్రేక్షకులను ఎల్లప్పుడూ ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు.

చదవండి: తొలిసారి భారత జట్టులోకి.. యువ సంచలనంపై అశ్విన్‌ ప్రశంసలు

మరిన్ని వార్తలు