బీసీసీఐ బాస్‌ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా 

27 Oct, 2021 21:29 IST|Sakshi

Ganguly Quits ATK Mohun Bagan Director Position: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోల్‌కతాకు చెందిన ఏటీకే మోహన్ బగాన్ ఫుట్‌బాల్ జట్టు డైరెక్టర్ పదవికి బుధవారం(అక్టోబర్‌ 27) రాజీనామా చేశాడు. ఐపీఎల్‌లో లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న RPSG గ్రూప్‌ యాజమాన్యంలోనే మోహన్ బగన్ జట్టు కూడా ఉండడమే ఇందుకు కారణం. బీసీసీఐ విరుద్ధ ప్రయోజనాల వివాదాన్ని నివారించేందుకు మోహన్‌ బగాన్‌ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గంగూలీ పేర్కొన్నాడు. ఈ జట్టుకు గంగూలీ డైరెక్టర్‌ మాత్రమే కాదు..షేర్‌ హోల్డర్‌ కూడా. 

కాగా, RPSG గ్రూప్‌ లక్నో జట్టును రూ.7,090 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ రూ. 5625 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ రెండు జట్ల చేరకతో ఐపీఎల్ 2022లో 10 జట్లు రంగంలోకి దిగనున్నాయి. లక్నో, అహ్మదాబాద్ జట్లను విక్రయించడం ద్వారా బీసీసీఐ రూ.12,715 కోట్లు ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే.
చదవండి: నీరజ్‌, మిథాలీకి ఖేల్‌రత్న.. ధవన్‌కు అర్జున అవార్డులు..!

మరిన్ని వార్తలు