ODI World Cup 2023: ప్రపంచకప్‌కు విలియమ్సన్‌ దూరం! న్యూజిలాండ్‌ ​కెప్టెన్‌గా లాథమ్‌

9 May, 2023 13:21 IST|Sakshi

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మొకాలి గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌-2023కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్‌-2023లో సీఎస్‌కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో విలియమ్సన్ ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో వెంటనే  స్వదేశానికి వెళ్లిన కేన్‌మామ మోకాలికి మేజర్‌ సర్జరీ చేయించుకోన్నాడు.

ఈ క్రమంలో అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఒక వేళ ప్రపంచకప్‌ సమయానికి విలియమ్సన్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోతే.. కివీస్‌ జట్టను టిమ్‌ సౌథీ లేదా టామ్‌ లాథమ్‌ నడిపించే అవకాశం ఉన్నట్లు ఆ జట్టు హెడ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ తెలిపాడు.

"కేన్‌ గాయం తీవ్రత గురించి మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తెలుస్తోంది. అతడు దాదాపుగా వరల్డ్‌కప్‌కు దూరమమ్యే ఛాన్స్‌ ఉంది. ఒక వేళ కేన్‌ అందుబాటులో లేకపోతే ఎవరని సారధిగా నియమిం‍చాలని అన్న ఆలోచనలో ఉన్నాం. సౌధీ ప్రస్తుతం టెస్టుల్లో కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ టామ్‌ లాథమ్‌కు వైట్‌బాల్‌ క్రికెట్‌లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఎక్కువగా ఉంది.

టామ్‌ పాకిస్తాన్‌ పర్యటనలో కూడా జట్టును అద్బుతంగా నడిపించాడు. అయితే జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉండడంతో వన్డే సిరీస్‌ను కోల్పోయాం. కానీ పరిమత ఓవర్ల కెప్టెన్‌గా లాథమ్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. అందుకే న్యూజిలాండ్‌ క్రికెట్‌ టామ్‌ వైపే మొగ్గు చూపవచ్చు అని విలేకురల సమావేశంలో  గ్యారీ స్టెడ్‌ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ బౌలర్‌ దూరం! జోర్డాన్‌ ఎం‍ట్రీ

మరిన్ని వార్తలు