Gautam Gambhir: అనూహ్యంగా సిక్స్‌ కొట్టిన వార్నర్‌.. ‘అలా చేయడం నిజంగా సిగ్గు చేటు’

12 Nov, 2021 15:22 IST|Sakshi

Gautam Gambhir And Ashwin Slams David warner: టీ20 ప్రపంచకప్‌-2021 లో భాగంగా గురువారం(నవంబర్‌11)న జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం సాధించి ఆస్టేలియా ఫైనల్లో అడుగు పెట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్‌  ఓపెనర్‌  డేవిడ్ వార్నర్ కొట్టిన ఒక సిక్సర్ మాత్రం ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. పాకిస్తాన్‌ బౌలర్‌ మహ్మద్ హఫీజ్ వేసిన డెడ్‌ బాల్‌ను డేవిడ్‌ వార్నర్‌  సిక్స్‌ కొట్టాడు. దీంతో వార్నర్‌ వ్యవహరించిన తీరును మాజీలు, క్రికెట్‌ నిపుణులు తప్పుపడుతున్నారు. వార్నర్‌ ఇలా చేయడం క్రీడా స్పూర్తి కి విరుద్దం అని పలువురు వార్నర్‌ను విమర్శిస్తున్నారు. 

ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌ కూడా వార్నర్‌పై విమర్శల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో  వార్నర్‌  వ్యవహరించిన తీరు సిగ్గు చేటు అని గంభీర్‌ పెదవి విరిచాడు. అదే విధంగా ఈ వివాదంపై అశ్విన్‌ స్పందించాలంటూ ట్విటర్‌ వేదికగా కోరాడు. స్పందించిన అశ్విన్‌... ‘ఇప్పుడు వార్నర్‌ చేసింది సరైందే అయితే.. గతంలో నేను కూడా చేసింది (మాన్కడింగ్‌) సరైందే! వార్నర్‌ చేసింది తప్పు అయితే.. నేను చేసింది కూడా తప్పే’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆస్టేలియా ఇన్నింగ్స్‌లో 8 ఓవర్‌ వేయడానికి వచ్చిన మహ్మద్ హఫీజ్ ... తన తొలి బంతిని వేసే క్రమంలో అతడి చేతి బంతి నుంచి జారిపోయి డబుల్ బౌన్స్‌తో వైడ్‌ దిశగా వెళ్లింది. అయితే స్టైక్‌లో ఉన్న వార్నర్‌ ఆ బంతిని సిక్స్‌కు తరలించాడు. బంతి రెండుసార్లు బౌన్స్ కావడంతో అంపైర్  నో బాల్‌గా ప్రకటించాడు. ఇక 49 పరుగులు చేసిన వార్నర్‌ ఆస్టేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా రెండో సెమిఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఆస్టేలియా.. న్యూజిలాండ్‌తో నవంబర్‌14న దుబాయ్‌ వేదికగా ఫైనల్లో తలపడనుంది.

చదవండి: AUS Vs NZ: ఆసీస్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌.. ఇక కష్టమే!

మరిన్ని వార్తలు