కపిల్‌ దేవ్‌ కిడ్నాప్‌ అయ్యాడా..? సంచలన వీడియో షేర్‌ చేసిన గంభీర్‌

25 Sep, 2023 16:21 IST|Sakshi

భారత వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ (1983), దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది. టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుతం ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ షేర్‌ చేసిన ఈ వీడియోలో కపిల్‌ దేవ్‌ కిడ్నాప్‌కు గురైనట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు కపిల్‌ దేవ్‌లా కనినిస్తున్న వ్యక్తిని చేతులు వెనుక్కు కట్టి, మాట్లాడకుండా నోటిని బట్టతో కట్టేసి బలవంతంగా లాక్కెళ్లుతున్నారు. ఆ సమయంలో కపిల్‌లా కనిపిస్తున్న వ్యక్తి వెనక్కు చూస్తూ ఏవో సైగలు చేస్తూ కనిపించాడు.

ఈ వీడియోలో నిజానిజాలెంతో తేలాల్సి ఉంది. కొందరు ఈ వీడియోను మార్పింఫ్‌ చేశారంటుంటే, మరికొందరు ఇది అడ్వటైజ్‌మెంట్‌ కోసం చేసిన వీడియో అని అంటున్నారు. ఈ వీడియోను భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఎక్స్‌లో షేర్‌ చేస్తూ.. ఈ క్లిప్‌ను నాలా ఇంకెవరైనా అందుకున్నారా అని ప్రశ్నించాడు. ఈ వీడియోలో ఉన్నది కపిల్‌ కాకుడదని అనుకుంటున్నానని.. కపిల్‌ క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నానని గంభీర్‌ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ఈ వీడియోలో నిజానిజాలటుంచితే.. ఈ న్యూస్‌ మాత్రం నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని వార్తలు