'సిద్దూ.. నీ పిల్లల్ని బార్డర్‌కు పంపి అప్పుడు ఇమ్రాన్‌ను ఎలాగైనా పిలుచుకో'

21 Nov, 2021 20:34 IST|Sakshi

Gautam Gambhir slams Navjot Singh Sidhu: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ.. ‘పెద్దన్న’గా సంభోదించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సిద్దూ వాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ వివాదంపై స్పందించిన.. భారత మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌.. సిద్దూపై  తీవ్ర విమర్శలు చేశాడు. నీ కూతురు, కుమారుడిని సరిహద్దులకు పంపు..  ఆతరువాత మాట్లాడు అని గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

‘నీ కుమారుడు లేదా కూతుర్ని సరిహద్దులకు పంపిన తర్వాతే తీవ్రవాద దేశాధినేతను పెద్దన్నగా పిలుచుకో.. అంటూ ట్విట్టర్ వేదికగా  గంభీర్‌ మండిపడ్డాడు. అతడి పిల్లలు సైన్యంలో ఉండి ఉంటే, సిద్దూ  ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్‌ను తన పెద్ద అన్న అని పిలిచేవాడా అని గంభీర్‌ ప్రశ్నించాడు. గత నెలలో కాశ్మీర్‌లో 40 మంది పౌరులు, సైనికులను చంపడంపై సిద్ధూ మాట్లాడలేదని.. ఇప్పుడు భారతీయ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని గౌతీ పేర్కొన్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే
శనివారం పాక్ లోని కర్తార్పూర్ సాహిబ్ ను దర్శించుకున్న సిద్ధూ..  అనంతరం మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్‌ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్  చొరవ వల్లే కర్తార్‌పూర్‌ కారిడార్‌ పునఃప్రారంభంమైంది అని  సిద్ధూ తెలిపాడు. ఈ క్రమంలో పాక్ ప్రధాని గురించి మాట్లాడూతూ.. 'ఇమ్రాన్ ఖాన్ నాకు పెద్దన్న వంటి వారు. అతడు నాకు చాలా ప్రేమను ఇచ్చాడు. దీనిని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను..’ అని వ్యాఖ్యానించాడు.

చదవండి: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన బీసీసీఐ.. వ‌చ్చే ఐపీఎల్ ఎక్కడంటే..

మరిన్ని వార్తలు