గంభీర్‌కు కరోనా నెగిటివ్‌

8 Nov, 2020 16:58 IST|Sakshi

న్యూఢిల్లీ: తనకు కరోనా సోకిందేమోననే భయంతో రెండు రోజుల క్రితం సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌కు నెగిటివ్‌ రావడంతో ఊపిరిపీల్చుకున్నాడు. గంభీర్‌కు నిర్వహించిన కోవిడ్‌-19 టెస్టుల్లో నెగిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని గంభీర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘నాకు కరోనా సోకలేదని విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. నాపై ఆదరాభిమనాలు చూపిన అందరికీ ధన్యవాదాలు. మళ్లీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించండి. సేఫ్‌గా ఉండండి’ అని ట్వీట్‌ చేశాడు. (‘ప్రతీసారి జట్టును మార్చలేరు’)

ఈ శుక్రవారం గంభీర్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. తన నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లో ఒకరికి కరోనా సోకడంతో గంభీర్‌ ముందస్తు జాగ్రత్తగా సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే కరోనా  టెస్టు చేయించుకోగా నెగిటివ్‌ వచ్చింది. దేశంలో కరోనావైరస్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.  సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు వరకు అందరూ కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో నిత్యం 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం కలవరపరుస్తోంది.(ఒక గిఫ్ట్‌గా ముంబై చేతిలో పెట్టారు: టామ్‌ మూడీ)

మరిన్ని వార్తలు