‘అప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లి’

21 Mar, 2021 14:22 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫెయిల్‌ అయితే.. కోహ్లి, రోహిత్‌లు మాత్రం పాసయ్యారంటూ లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ చమత్కరించాడు. ఐదో టీ20లో ఇంగ్లండ్‌పై విజయం అనంతరం గవాస్కర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఐదో టీ20లో రోహిత్ శర్మ‌, విరాట్‌ కోహ్లి జోడి రాణించడంపై గవాస్కర్‌ మాట్లాడుతూ..''రాహుల్‌ ఫెయిల్యూర్‌ కారణంగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌కు ముందు మంచి ఓపెనింగ్‌ జోడి దొరికింది. ఒక టీమ్‌లో ఉండే బెస్ట్ బ్యాట్స్‌మెన్.. వన్డే, టీ20ల్లో సాధ్యమైనంత ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. అలా చూసుకుంటే విరాట్ కోహ్లీ టాప్ ఆర్డర్లో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడంలో దిట్ట. అందుకే తాను ఓపెనర్‌గా రావడమే గాక రోహిత్‌కు సహకరిస్తూ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి అంశం టీమిండియాకు చాలా కీలకం. అందులోనూ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్‌ ఒకరకంగా జట్టుకి మేలు చేసింది. గతంలో సచిన్ టెండూల్కర్ కూడా వన్డేల్లో మిడిలార్డర్‌లో ఆడేవాడు. కానీ.. అతడ్ని ఓపెనర్‌గా ఆడించగానే.. ఊహించని రీతిలో క్లిక్ అయ్యాడు. ఆ తర్వాత సచిన్‌ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు కోహ్లికి కూడా ఆ అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

వాస్తవానికి ఐదు టీ20ల ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్‌కి వరుసగా నాలుగు టీ20ల్లోనూ అవకాశం కల్పించంది. కానీ.. రాహుల్ మాత్రం 1, 0, 0, 14 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో.. ఐదో టీ20కి అతనిపై వేటు పడింది. ఇక మ్యాచ్‌లో కోహ్లి హిట్‌మాన్‌ రోహిత్‌తో కలిసి తొలి వికెట్‌కు 54 బంతుల్లోనే 94 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించాడు. రోహిత్‌ అవుటైన తర్వాత మరింత బాధ్యతగా ఆడిన కోహ్లి 52 బంతుల్లో 80 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవరల్లో 2వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అనంతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి పరాజయం పాలైంది. ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది.
చదవండి:
కోహ్లి ఓపెనింగ్‌ చేస్తే నాకు అభ్యంతరమేంటి!
వైరల్‌: బట్లర్‌ తీరుపై కోహ్లి ఆగ్రహం

మరిన్ని వార్తలు