Sunil Gavaskar-Kohli: 'ఏం మెసేజ్‌ కావాలి'.. కోహ్లిపై దిగ్గజ క్రికెటర్‌ ఆగ్రహం

6 Sep, 2022 18:18 IST|Sakshi

టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సమయంలో తనకు ధోని మినహా మిగతావారు ఎవరు మెసేజ్‌ చేయలేదని కోహ్లి బాధపడిన సంగతి తెలిసిందే. ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా కోహ్లి వ్యాఖ్యలను టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ తప్పుబట్టాడు. కోహ్లిని ఉద్దేశించి 'ఇంకా ఎవరి మెసేజ్‌ కావాలి' అంటూ పరోక్షంగా చురకలంటించాడు.

''స్వతహాగా కెప్టెన్సీ వదులుకున్నాక అతనికి ఇంకేం మద్దతు కావాలో అర్ధం కావట్లేదు. అసలు కోహ్లి ఎవరి మద్దతు కోరుకుంటున్నాడో తెలియట్లేదు. కనీసం ఎవరి పేర్లైనా ప్రస్తావించి ఉంటే వారినే వెళ్లి అడిగేవాళ్లం. కోహ్లి తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. కెప్టెన్సీ వదిలేయడం, కోల్పోవడం చాలా సహజమని.. ముగిసిపోయిన అధ్యాయాన్ని కోహ్లి మళ్లీ తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేయడం కరెక్ట్‌ కాదు.

కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన వ్యక్తి ఆట మీదే ఫోకస్ పెట్టడమే మంచిది. కెప్టెన్‌గా ఉన్నప్పుడు తన సహచరుల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కసారి కెప్టెన్సీ వదిలేశాక.. నీ ఆట మీద ఫోకస్ పెడితే మంచిది'' అంటూ చురకలంటించాడు. 1985లో తాను కెప్టెన్సీని వదులుకున్నప్పుడు ఎవరూ తనకు ప్రత్యేకంగా మెసేజ్‌లు పెట్టలేదని గావస్కర్‌ గుర్తుచేసుకున్నాడు. 

చదవండి: కోహ్లిపై మండిపడ్డ బీసీసీఐ.. మళ్లీ అగ్గి రాజేసిన రన్‌ మెషీన్‌ వ్యాఖ్యలు 

US Open 2022: అందంతో కట్టిపడేసింది.. ఎత్తిన గ్లాస్‌ దించకుండా తాగింది

మరిన్ని వార్తలు