కొడుకుతో హర్భజన్‌ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్‌

15 Jul, 2021 14:09 IST|Sakshi

టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇటీవల రెండోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. హర్భజన్ భార్య గీతా బస్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భజ్జీ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.  తాజాగా హర్భజన్ సింగ్, గీతా బాస్రా జంట తమ ముద్దుల కొడుకుతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్తుండగా కెమెరా కంటికి చిక్కారు. ముంబై ఆసుపత్రి నుంచి వస్తుండగా నవజాత శిశువు,  కుమార్తె హినయాతో కలిసి కుటుంబమంతా చిరునవ్వులతో ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. 

కాగా హర్భజన్, గీతా బస్రా దంపతులకు 2016లో వీరికి సంతానంగా ఓ పాప జన్మించింది. ఇప్పుడు కొడుకు పుట్టాడు.  ఈ మేరకు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో భావోద్వేగంతో ఓ సందేశాన్ని హర్భజన్‌ షేర్ చేశాడు. ‘మేం పట్టుకోవడానికి మరో చిన్ని చేతులు మాకు అందాయి. బుజ్జాయి ఇంట్లోకి రావడంతో మేం చాలా సంతోషంగా ఉన్నాము. మా జీవితంలో అద్భుతమైన బహుమతి పొందాం. మా మనసులో ఆనందంతో బరువెక్కాయి. మా జీవితం ఇప్పుడు పూర్తి అయిన భావన కలుగుతోంది. గీతా బస్రా, బాబు ఆరోగ్యంగా ఉన్నారు. మాపై ప్రేమ చూపుతూ, మద్దతుగా నిలుస్తున్న శ్రేయోభిలాషులు, అభిమానులకు ధన్యవాదాలు అని ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు