World Athletics Championship: 'నా కొడుకు ప్రపంచ చాంపియన్‌.. గర్వంగా ఉంది'

21 Jul, 2022 15:03 IST|Sakshi

పురుషుల 1500 మీటర్ల పరుగు...ప్రసారకర్తల కామెంటరీ బృందంలో ఒకడైన జెఫ్‌ వైట్‌మన్‌ రేసు ప్రారంభం కాగానే తన వ్యాఖ్యానం వినిపిస్తున్నాడు. 500 మీ...1000 మీ...1400 మీ. ముగిశాయి...అప్పటి వరకు అతను మంచి జోష్‌తో ఉత్కంఠ పెరిగేలా పరుగు గురించి మాట్లాడుతున్నాడు. రేసు పూర్తయింది... కానీ అతని మాట వినిపించలేదు. ఒక్కసారిగా అతని గొంతు ఆగిపోయింది. ప్రేక్షకులకు క్షణం పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. కొంత విరామంతో అతను మళ్లీ అనేశాడు...‘అతను నా కొడుకు, వాడు ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌’ అంటూ వైట్‌మన్‌ ఉద్వేగంగా ముగించాడు.

అంతే మైదానంలో ఒక్కసారిగా హర్షధ్వానాలు... సమీపంలో ఉన్నవారంతా చుట్టు చేరి అభినందనలతో ముంచెత్తారు. ఈ రేసును 3 నిమిషాల 29.23 సెకన్లలో పూర్తి చేసి బ్రిటన్‌ అథ్లెట్‌ జేక్‌ వైట్‌మన్‌ స్వర్ణం సొంతం చేసుకోవడం ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల ఐదో రోజు హైలైట్‌గా నిలిచింది. ఈ ఈవెంట్‌లో జాకన్‌ ఇన్‌బ్రిట్సన్‌ (నార్వే– 3 నిమిషాల 29.47 సెకన్లు), మొహమ్మద్‌ కతిర్‌ (స్పెయిన్‌–3 ని. 29.90 సె.) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. 

Yaroslava Mahuchikh: బాంబుల మోత తప్పించుకొని పతకం గెలిచి..

మరిన్ని వార్తలు