German Open 2023: లక్ష్య సేన్‌కు షాక్‌ 

9 Mar, 2023 07:28 IST|Sakshi

జర్మన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు, ప్రపంచ 12వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.

బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్‌ క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌) 21–19, 21–16తో ఆరో సీడ్‌ లక్ష్య సేన్‌ను బోల్తా కొట్టించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. పొపోవ్‌పై గతంలో నాలుగుసార్లు నెగ్గిన లక్ష్య సేన్‌ రెండోసారి ఓటమి చవిచూశాడు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు