20 ఓవర్లలో 32 పరుగులు.. టీ20 మ్యాచ్‌ను కాస్త టెస్టు మ్యాచ్‌గా

30 Aug, 2021 14:38 IST|Sakshi

ముర్షియా: టీ 20 మ్యాచ్‌ అంటేనే మెరుపులకు పెట్టింది పేరు. ఫోర్లు, సిక్పర్ల వర్షంతో బ్యాట్స్‌మన్‌ పండగ చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఒక​ టీ20 మ్యాచ్‌ను టెస్టు మ్యాచ్‌గా మార్చిన ఘనత జర్మనీ వుమెన్స్‌ సొంతం చేసుకుంది. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన జర్మనీ వుమెన్స్‌ 3 వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేసింది. విశేమేమిటంటే ఈ మ్యాచ్‌లో జర్మనీ జట్టు ఓడిపోయినప్పటికి వికెట్లు సమర్పించుకోకుండా జిడ్డుగా ఆడుతూ టెస్టు మ్యాచ్‌ను రుచి చూపించారు.

చదవండి: అంపైర్‌ను భయపెట్టిన పుజారా.. తృటిలో తప్పించుకున్నాడు
ఈ మ్యాచ్‌ జరిగి మూడు రోజులు కాగా.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఐర్లాండ్‌ వేదికగా ఐసీసీ వుమెన్స్‌ టీ20 క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌ జరుగుతున్నాయి. టోర్నీలో భాగంగా జర్మనీ వుమెన్స్‌, ఐర్లాండ్‌ వుమెన్స్‌ మధ్య టీ20 మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ వుమెన్‌ 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ గాబీ లూయిస్‌ (60 బంతుల్లో 105 పరుగులు; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), మరో ఓపెనర్‌ రెబెక్కా స్టోకెల్‌ 44 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జర్మనీ వుమెన్స్‌ జట్టు 20 ఓవర్లపాటు ఆడి 3 వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేసింది. క్రిస్టినా గఫ్‌ 14 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. దీంతో టీ20 చరిత్రలోనే జర్మనీ వుమెన్స్‌ పరమ చెత్త రికార్డును మూటగట్టుకుంది.

చదవండి: IPL 2021 UAE: ఆర్సీబీకి షాక్‌.. గాయంతో స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఔట్‌

ఇక ఈ మ్యాచ్‌లో జర్మనీ వుమెన్స్‌ జిడ్డు ఆటతీరుపై అభిమానులు సోషల్‌ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు. జర్మనీ వుమెన్స్‌ బ్యాటింగ్‌ను గావస్కర్‌ బ్యాటింగ్‌తో పోల్చారు.'' టీ20 మ్యాచ్‌ను కాస్త టెస్టు మ్యాచ్‌గా మార్చేశారు.  నాకు తెలిసి వాళ్లకు గావస్కర్‌.. పుజారా లాంటి టెస్టు బ్యాట్స్‌మన్‌ గుర్తుకు వచ్చి ఉంటారు..'' అంటూ కామెంట్స్‌ చేశారు.

మరిన్ని వార్తలు