IND vs ZIM: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. సచిన్‌ 24 ఏళ్ల రికార్డు బద్దలు!

22 Aug, 2022 19:30 IST|Sakshi

టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ తన తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీని నమోదు చేశాడు. హరారే వేదికగా జింబాబ్వేతో మూడో వన్డేలో గిల్‌ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 97 బంతులు ఎదుర్కొన్న గిల్‌ 130 పరుగులు సాధించాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను గిల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

సచిన్‌ రికార్డు బద్దలు
వన్డేల్లో జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన భారత ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో 127 పరుగులు సాధించి సచిన్‌ అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 130 పరుగులు సాధించిన గిల్‌.. సచిన్‌ 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా ర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్‌(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్‌ కిషన్‌(50), ధావన్‌(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్‌ సాధించారు. అనంతరం 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే తడబడుతోంది.

జింబాబ్వే గడ్డపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన భారత్‌ ఆటగాళ్లు వీరే.
శుబ్‌మాన్ గిల్ - 130
సచిన్ టెండూల్కర్ 127(నాటౌట్‌)
అంబటి రాయుడు 124
యువరాజ్ సింగ్ 120
శిఖర్ ధావన్ 116


చదవండిZIM vs IND:'ఓపెనర్‌గా శార్దూల్ వచ్చాడు అనుకున్నా.. ఆటగాళ్లకు సరైన జెర్సీలు లేకుండా పోయాయి'

మరిన్ని వార్తలు