ICC T20I Rankings: దుమ్మురేపిన శుభ్‌మన్‌ గిల్‌.. సత్తా చాటిన హార్ధిక్‌ పాండ్యా

8 Feb, 2023 19:27 IST|Sakshi

ఐసీసీ తాజాగా (ఫిబ్రవరి 8) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. న్యూజిలాండ్‌పై సిరీస్‌ విక్టరీ (2-1) సాధించడంతో భారత ఆటగాళ్ల ర్యాంక్‌లు అమాంతం పెరిగిపోయాయి. యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ ఏకంగా 168 స్థానాలు ఎగబాకి 30 స్థానానికి చేరుకోగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్ధిక్‌ పాండ్యా అగ్రస్థానానికి అతి చేరువలో రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్‌తో సిరీస్‌లో పర్వాలేదనిపించిన అర్షదీప్‌ సింగ్‌ 8 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు.

టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌, ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్‌ అల్‌ హసన్‌ టాప్‌ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్‌ విభాగంలో టీమిండియా ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి ఒక స్థానం దిగజారగా (14 నుంచి 15), కేఎల్‌ రాహుల్‌ 2 స్థానాలు దిగజారి 27కు, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక స్థానం దిగజారి 28 నుంచి 29 స్థానానికి చేరుకున్నాడు. టాప్‌ 30లో మొత్తంగా ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. సూర్యకుమార్‌ తర్వాత మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌, డెవాన్‌ కాన్డే, డేవిడ్‌ మలాన్‌, రిలీ రొస్సో, ఆరోన్‌ ఫించ్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌, అలెక్స్‌ హేల్స్‌ టాప్‌-10లో ఉన్నారు. 

బౌలింగ్‌ కేటగిరి టాప్‌-30లో నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. అర్షదీప్‌ 13, భువనేశ్వర్‌ కుమార్‌ 21, అశ్విన్‌ 29, అక్షర్‌ పటేల్‌ 30వ స్థానంలో నిలిచారు. రషీద్‌ తర్వాత వనిందు హసరంగ, ఆదిల్‌ రషీద్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, సామ్‌ కర్రన్‌, తబ్రేజ్‌ షంషి, ఆడమ్‌ జంపా, ముజీబుర్‌ రెహ్మాన్‌, అన్రిచ్‌ నోర్జే, మిచెల్‌ సాంట్నర్‌ టాప్‌-10లో ఉన్నారు.

ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్‌, హార్ధిక్‌ తర్వాత మహ్మద్‌ నబీ, హసరంగ, జెజె స్మిట్‌, సికందర్‌ రజా, డేవిడ్‌ వీస్‌, స్టొయినిస్‌, మొయిన్‌ అలీ, మ్యాక్స్‌వెల్‌ టాప్‌-10లో ఉన్నారు. ఇదిలా ఉంటే, టీమిండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఆల్‌టైమ్‌ బెస్ట్‌ రేటింగ్‌ పాయింట్లు సాధించడానికి మరో 9 పాయింట్లు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం​ స్కై ఖాతాలో 906 పాయింట్లు, ఉండగా ఆల్‌టైమ్‌ బెస్ట్‌ రేటింగ్‌ పాయింట్లు డేవిడ్‌ మలాన్‌ పేరిట ఉన్నాయి. మలాన్‌ 2020లో 915 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో హార్ధిక్‌ పాండ్యా అగ్రస్థానానికి చేరుకునేందుకు మరో 2 రేటింగ్‌ పాయింట్ల దూరంలో ఉన్నాడు.  

మరిన్ని వార్తలు