Cheteswar Pujara: అప్పుడు 'గోల్డెన్‌' రనౌట్‌.. ఇప్పుడు 'గోల్డెన్‌' డక్‌

26 Dec, 2021 17:35 IST|Sakshi

Cheteswar Pujara Golden Duck 2 Times By Lungi Ngidi.. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా మరోసారి నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో ముగిసిన టెస్టు సిరీస్‌లో పుజారా అంతగా ఆకట్టుకోలేదు. కివీస్‌తో టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులు కలిపి.. నాలుగు ఇన్నింగ్స్‌లో 0, 47, 26,22 పరుగులు మాత్రమే చేశాడు. తాజగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పుజారా అదే పూర్‌ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆడిన తొలి బంతికే క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.

చదవండి: IND VS SA 1st Test: లడ్డూలాంటి క్యాచ్‌ వదిలేశారు.. ఫలితం అనుభవించండి

ఎన్గిడి వేసిన ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌ మూడో బంతికి పుజారా ఔట్‌ కాగా.. అంతకముందు బంతికే మయాంక్‌(60) ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక సౌతాఫ్రికా గడ్డపై పుజారా డకౌట్‌ కావడం ఇది రెండోసారి. యాదృశ్చికంగా రెండుసార్లు ఎన్గిడి బౌలింగ్‌లోనే పుజారా డకౌట్‌ కావడం విశేషం. 2107-18లో సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్‌ వేదికగా  జరిగిన రెండో టెస్టులో పుజారా ఎన్గిడి బౌలింగ్‌లో రనౌట్‌ అయ్యాడు. అప్పుడు ఒక్క బంతి మాత్రమే ఎదుర్కొన్న పుజారా పరుగులేమి చేయకుండానే రనౌట్‌ రూపంలో గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. తాజాగా మరోసారి పుజారా ఎన్గిడి బౌలింగ్‌లోనే అదే సెంచూరియన్‌లో గోల్డెన్‌ డక్‌ కావడం ఆసక్తి కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పుజారాను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. మొన్న కివీస్‌తో టెస్టు సిరీస్‌లో రహానే .. ఇప్పుడు ప్రొటీస్‌ సిరీస్‌లో నువ్వు తయారయ్యావా'' అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు.

చదవండి: Trolls As Ajinkya Rahane In Playing XI: మరీ ఇంత దారుణమా.. పాపం విహారి.. తనకే ఎందుకిలా!

మరిన్ని వార్తలు