భారత అథ్లెట్‌ గోమతి అప్పీల్‌ తిరస్కరణ

6 May, 2021 06:20 IST|Sakshi

న్యూఢిల్లీ: కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్‌)లో భారత మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ గోమతి మరిముత్తుకు చుక్కెదురైంది. డోపింగ్‌కు పాల్పడినందుకు గోమతిపై 2019లో నాలుగేళ్ల నిషేధం పడింది. దీనిని సవాల్‌ చేస్తూ ఆమె సీఏఎస్‌ను ఆశ్రయించింది. 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల పరుగులో గోమతి స్వర్ణం గెలవగా... ఆ తర్వాత ఆమె డోపింగ్‌లో పట్టుబడటంతో వరల్డ్‌ అథ్లెటిక్స్‌ డిసిప్లినరీ ట్రిబ్యునల్‌ నాలుగేళ్ల నిషేధం విధించింది. తాను పాలీ సిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడుతుండటంతో పాటు గర్భస్రావం జరిగిన కారణంగా శరీరంలో 19–నోరాన్‌డ్రోస్టిరోన్‌ ఎక్కువగా కనిపించిందని, సరైన రీతిలో పరీక్షలు కూడా నిర్వహించలేదని ఆమె తన అప్పీల్‌లో పేర్కొనగా... ఆర్బిట్రేటర్‌ జాన్‌ పాల్సన్‌ దానిని త్రోసి పుచ్చి నిషేధం కొనసాగుతుందని తీర్పునిచ్చారు.  

మరిన్ని వార్తలు