యువ భారత్‌ శుభారంభం 

6 Dec, 2023 00:48 IST|Sakshi

దక్షిణ కొరియాపై 4–2తో విజయం

అరైజీత్‌ సింగ్‌ ‘హ్యాట్రిక్‌’  

కౌలాలంపూర్‌: జూనియర్‌ పురుషుల అండర్‌–21 ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్‌ భారత జట్టు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పూల్‌ ‘సి’ తొలి మ్యాచ్‌లో టీమిండియా 4–2 గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. భారత్‌ తరఫున అరైజీత్‌ సింగ్‌ హుండల్‌ మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్‌’ సాధించాడు. అరైజీత్‌ 11వ, 16వ, 41వ నిమిషాల్లో గోల్స్‌ చేశాడు.

మరో గోల్‌ను అమన్‌దీప్‌ (30వ ని.లో) సాధించాడు. కొరియా తరఫున డోహున్‌ లిమ్‌ (38వ ని.లో), మిన్‌క్వాన్‌ కిమ్‌ (45వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. రేపు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌తో భారత్‌ ఆడుతుంది. మంగళవారమే జరిగిన ఇతర లీగ్‌ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్‌ 3–1తో ఈజిప్ట్‌పై, జర్మనీ 5–3తో దక్షిణాఫ్రికాపై, స్పెయిన్‌ 7–0తో కెనడాపై, అర్జెంటీనా 1–0తో ఆ్రస్టేలియాపై, మలేసియా 7–1తో చిలీపై గెలుపొందాయి.   

>
మరిన్ని వార్తలు