క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన బీసీసీఐ.. వ‌చ్చే ఐపీఎల్ ఎక్కడంటే..

21 Nov, 2021 17:17 IST|Sakshi

Great news for IPL fans as BCCI Sec confirms IPL 2022 will be in India: ఐపీఎల్‌ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే సీజన్‌ భారత్‌లోనే జరగనుందని బీసీసీ సెక్రెటరీ జై షా సృష్టం చేశారు. చెన్నైలో జరిగిన ‘ది ఛాంపియన్స్ కాల్’ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. రెండు కొత్త జట్లు చేరడంతో వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ మరింత  ఉత్కంఠభరితంగా జరుగుతుందని జైషా తెలిపారు.

“చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడటం కోసం మీరంతా అతృతగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీ కోరిక త్వరలోనే నెరవేరనుంది. ఐపీఎల్ 15వ సీజన్ ఇండియాలోనే జరగనుంది. రెండు కొత్త జట్లు చేరడంతో ఈలీగ్‌ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. వచ్చే సీజన్‌లో అహ్మదాబాద్, లక్నో  రూపంలో రెండు కొత్త జట్లు రానున్నాయి. వచ్చే సీజన్‌ కోసం మెగా ఆక్షన్‌ జనవరి తొలివారంలో జరిగే అవకాశం ఉంది"అని జైషా వెల్లడించారు.

ఇక ఐపీఎల్‌-2021 విజేత చెన్నై సూపర్ కింగ్స్ మాట్లాడుతూ.. "ఇన్నేళ్లుగా ఐపీఎల్‌లో చెన్నై తిరుగులేని జట్టుగా నిలిచిందంటే.. దానికి కారణం జట్టు చైర్మన్‌ ఎన్ శ్రీనివాసన్‌ అనే చెప్పాలి. ఎందుకంటే అతడు కష్ట సమయాల్లో తన జట్టుకు అండగా నిలిచాడు. అదేవిధంగా ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్‌కూడా సీఎస్‌కేను విజయం పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేశాడు" అని అతడు చేప్పారు.

చివరగా ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్ ధోని గురించి మాట్లాడుతూ.. "ధోని లాంటి కెప్టెన్  సీఎస్‌కే దొరకడం వాళ్ల అదృష్టం. చెన్నై అభిమానుల గుండెచప్పుడు ధోని. భారత్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహి. అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు అందించిన విజయాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి" అని జై షా పేర్కొన్నారు.

చదవండి: WI vs SL: తలకు బలంగా తగిలిన బంతి.. ఫీల్డ్‌లోనే కుప్పకూలాడు

మరిన్ని వార్తలు