GT Playing XI vs LSG: అన్నదమ్ముల సవాల్‌.. శ్రీలంక కెప్టెన్‌ ఐపీఎల్‌ ఎంట్రీ! అతడు కూడా..

7 May, 2023 13:13 IST|Sakshi

ఐపీఎల్‌-2023లో అన్నదమ్ముల మధ్య సవాల్‌కు సమయం అసన్నమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు తలపడనున్నాయి. గుజరాత్‌కు కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య వ్యవహరించనుండగా.. లక్నోకు హార్దిక్‌ సోదరుడు కృనాల్‌ పాండ్యా సారధ్యం వహించనున్నాడు.

లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో  కృనాల్‌ పాండ్యా కెప్టెన్సీ బాధ‍్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక రాజస్తాన్‌పై అద్భుతవిజయం సాధించిన గుజరాత్‌.. అదే జోరును లక్నోపై కొనసాగించాలని భావిస్తోంది.

ఇక ఈ మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్‌ పేసర్‌, ఐర్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జాషువా లిటల్‌ దూరమయ్యాడు. తన జాతీయ జట్టు విధులు నిర్విర్తించేందుకు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. ఇంగ్లండ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్‌ తలపడనుంది. మే 9 నుంచి మే 14 వరకు ఈ సిరీస్‌ జరగనుంది. అనంతరం లిటిల్‌ మళ్లీ గుజరాత్‌ జట్టుతో కలవనున్నాడు.

శ్రీలంక కెప్టెన్‌ ఐపీఎల్‌ ఎంట్రీ
ఇక లిటిల్‌ స్థానం‍లో శ్రీలంక పరిమిత ఓవర్ల కెప్టెన్‌ దసన్‌ షనకను తీసుకోవాలని గుజరాత్‌ మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. భారత గడ్డపై అద్భుతమైన ట్రాక్‌ రికార్డు కలిగి ఉన్న షనక ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేయనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అదే విధంగా అభినవ్‌ మనోహర్‌ స్ధానంలో సాయిసుదర్శన్‌ జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.

మైర్స్‌ ఔట్‌.. డికాక్‌ ఇన్‌
మరోవైపు లక్నో కూడా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. ఓపెనర్‌ కైల్‌ మైర్స్‌ స్ధానంలో ప్రోటీస్‌ స్టార్‌ ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. మైర్స్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో డికాక్‌ చోటు దక్కలేదు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో మైర్స్‌ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో మైర్స్‌ను పక్కన పెట్టి డికాక్‌ను తీసుకురావాలని లక్నో మెనెజ్‌మెంట్‌ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తుది జట్లు(అంచనా)
గుజరాత్‌ టైటాన్స్‌
వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, సాయిసుదర్శన్‌, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, దసన్‌ షనక
గుజరాత్ టైటాన్స్ సబ్‌స్ట్యూట్స్‌: శుభమాన్ గిల్, మనోహర్‌,శ్రీకర్ భరత్, శివమ్ మావి,  సాయి కిషోర్

లక్నో సూపర్‌ జెయింట్స్‌
డికాక్‌, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్‌ కీపర్‌), కృనాల్ పాండ్యా (కెప్టెన్‌), కృష్ణప్ప గౌతం, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్

చదవండి: IPL 2023: అందుకే అలా చేశా.. అతడు మా జట్టుకు దొరికిన నిజమైన ఆస్తి! అద్భుతాలు సృష్టిస్తాడు

మరిన్ని వార్తలు