WPL 2023: గుజరాత్‌ జెయింట్స్‌ హెడ్‌ కోచ్‌గా ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

3 Feb, 2023 19:18 IST|Sakshi

ఆరంభ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో గుజరాత్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీ తమ జట్టు ప్రధానకోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ రచెల్ హేన్స్‌ను నియమించింది. అదే విధంగా తుషార్ అరోథేను బ్యాటింగ్‌ కోచ్‌గా, భారత మాజీ స్పిన్నర్ నూషిన్ అల్ ఖదీర్‌ను బౌలింగ్ కోచ్‌గా గుజరాత్‌ ఎంపికచేసింది.

కాగా తొట్టతొలి అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా నూషిన్ అల్ ఖదీర్‌ పని చేశాడు. అతడి నేతృత్వంలోని భారత జట్టు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఇక ఈ ముగ్గురు గుజరాత్‌ జెయింట్స్‌ మెంటార్‌ మిథాలీ రాజ్‌తో కలిసి పనిచేయనున్నారు. 

రచెల్ హేన్స్‌.. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టులో చాలా కాలం పాటు కీలక సభ్యురాలిగా కొనసాగింది. అదే విధంగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టులో హేన్స్‌ భాగంగా ఉంది. ఆమె ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు 6 టెస్టులు, 77 వన్డేలు, 84 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించింది. ఆమె వన్డేల్లో అద్భుతంగా రాణించింది. హేన్స్‌ 77 వన్డేల్లో 2585 పరుగులు చేసింది. అందులో 19 అర్ధ సెంచరీలతో పాటు రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.

 డబ్ల్యూపీఎల్‌ వేలం ఎప్పుడంటే?
మహిళల ఐపీఎల్‌కు సంబంధించిన తొట్టతొలి వేలం ఫిబ్రవరి 13న ముంబై వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా వేలంలో దాదాపు 1000 మంది

WPLకు సంబంధించిన వివరాలు..

లీగ్‌లో మొత్తం జట్లు: 5
మ్యాచ్‌ల సంఖ్య (అంచనా): 22
వేదికలు (అంచనా): బ్రబౌర్న్‌ స్టేడియం (ముంబై), డీవై పాటిల్‌ స్టేడియం (ముంబై)

జట్లు తదితర వివరాలు..

1. అదానీ స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (అహ్మదాబాద్‌, 1289 కోట్లు)

2. ఇండియా విన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ముంబై, 912.99 కోట్లు)

3. రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు, 901 కోట్లు)

4. జేఎస్‌డబ్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఢిల్లీ, 810 కోట్లు)

5. క్యాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (లక్నో, 757 కోట్లు)
చదవండి:
 BGT 2023: గెలుపెవరిది.. రికార్డులు ఏం చెబుతున్నాయి..?

మరిన్ని వార్తలు