Maharaja Trophy T20: మనీష్‌ పాండే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. గుల్బర్గాదే మహారాజా ట్రోపీ

27 Aug, 2022 07:47 IST|Sakshi
Photo Credit: Google

మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టి20 లీగ్‌ 2022 తొలి సీజన్‌ విజేతగా మనీష్‌ పాండే నేతృత్వంలోని గుల్బర్గా మైస్టిక్స్‌ నిలిచింది. శుక్రవారం రాత్రి బెంగళూరు బుల్స్‌తో జరిగిన ఫైనల్లో గుల్బర్గా 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసిన మనీష్‌ పాండే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుల్బర్గా మైస్టిక్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది.

దేవదత్‌ పడిక్కల్‌(42 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ మనీష్‌ పాండే 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు నాటౌట్‌ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. అంతకముందు జెస్వాత్‌ ఆచార్య 39, రోహన్‌ పాటిల్‌ 38, కృష్ణన్‌ షిర్జిత్‌ 38 పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు బుల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ ఎల్‌ఆర్‌ చేతన్‌ (40 బంతుల్లో 91 పరుగులు, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌​ ఆడాడు. క్రాంతి కుమార్‌ 41 మినహా మిగతావారెవరు రాణించకపోవడంతో బెంగళూరు బుల్స్‌ విజయానికి 11 పరుగుల దూరంలో ఆగిపోయింది.

చదవండి: Asia Cup 2022: ‘ఆసియా’ అందుకునేందుకు..

మరిన్ని వార్తలు