European Cricket League 2022: చూసి చూసి బోర్‌ కొడుతుంది.. అయినా మళ్లీ ఒకసారి 

10 Feb, 2022 16:25 IST|Sakshi

క్రికెట్‌లో ఎన్నిసార్లు విన్నా బోర్‌ కొట్టని విషయాలు కొన్ని ఉంటాయి. వాటిలో స్టన్నింగ్‌ క్యాచ్‌లు అనే పదం తరచుగా వింటాం. ఈసారి కూడా ఒక స్టన్నింగ్‌ క్యాచ్‌ గురించి ప్రస్తావించుకుందాం. ఫీల్డర్‌ క్యాచ్‌ పట్టిన విధానం చూసి ఫిదా కావాల్సిందే. యూరోపియన్‌ క్రికెట్‌ లీగ్‌ 2022లో ఇది చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా వాన్‌హోమ్‌, డ్రూక్స్‌ క్రికెట్‌ క్లబ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో వాలోహోమ్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

చదవండి:  కష్టపడింది నేనైతే.. క్రెడిట్ మరొకరికా..? అజింక్య రహానే సంచలన వ్యాఖ్యలు

వాలోహోమ్‌ కెప్టెన్‌ హమీద్‌ షా తొలుత బ్యాటింగ్‌లో మెరిశాడు. ఆ తర్వాత ఫీల్ఢింగ్‌లోనూ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్లో కమ్రాన్‌ అహ్మద్‌జై స్ట్రెయిట్‌ షాట్‌ ఆడాడు. అతను కొట్టిన స్రెయిట్‌ షాట్‌ కచ్చితంగా సిక్స్‌ అని భావిస్తాం. కానీ ఇక్కడే ఊహించని ఘటన చోటుచేసుకుంది. లాంగాన్‌ నుంచి పరిగెత్తుకు వచ్చిన హమీద్‌ షా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. అతని బ్యాలెన్సింగ్‌ విధానానికి వారెవ్వా అనుకుండా మాత్రం ఉండలేం. కచ్చితంగా హమీద్‌ షా పట్టిన క్యాచ్‌.. క్యాచ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలవడం ఖాయం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

>
మరిన్ని వార్తలు