బ్యాట్స్‌మన్‌ను ప్రాంక్‌ చేసిన బౌలర్‌.. వీడియో వైరల్‌

18 May, 2021 20:56 IST|Sakshi

లండన్‌: క్రికెట్‌లో అప్పుడప్పుడు ఫన్నీ మూమెంట్స్‌ చోటుచేసుకోవడం సహజం. అయితే బ్యాట్స్‌మన్‌, బౌలర్‌ మధ్య జరిగే కొన్ని చిలిపి సంఘటనలు మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. వివరాలు.. మంగళవారం చాంపియన్‌షిప్‌లో భాగంగా మిడిల్‌సెక్స్‌, హాంప్‌షేర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్‌ బ్యాట్స్‌మన్‌ నిక్‌ గుబ్బిన్స్‌ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 

ఇన్నింగ్స్‌ మధ్యలో హాంప్‌షేర్‌ బౌలర్‌ కీత్ బార్కర్ వేసిన ఓవర్లో నిక్‌ బ్యాక్‌వర్డ్‌ దిశగా షాట్‌ ఆడాడు. రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించగా.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు వెళ్లిన నిక్‌ క్రీజులో జారి పడ్డాడు. దీంతో మిడిల్‌సెక్స్‌ ఒక్క పరుగుకే పరిమితమైంది. ఇంతవరకు బాగానే ఉంది.. అసలు మజా ఇక్కడే జరిగింది. బంతి విసిరిన బార్కర్‌ వెనక్కి వస్తున్నాడు. అప్పటికే క్రీజులో కిందపడి ఉన్న నిక్‌కు హెల్ఫ్‌ చేస్తున్నట్లుగా తన హ్యాండ్‌ను అతనికి అందించాడు. అది చూసిన నిక్‌ అతనికి చేయి ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇంతలో బార్కర్‌కు ఏమనిపించిందో వెంటనే తన చేయిని వెనక్కి తీసుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత నిక్‌ లేచి బార్కర్‌ను చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో గ్రేడ్‌ క్రికెటర్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఇక ఈ మ్యాచ్‌లో హాంప్‌షేర్‌ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన మిడిల్‌సెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసింది. ఆ తర్వాత హాంప్‌షేర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులు చేసి 36 పరుగులు ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మిడిల్‌సెక్స్‌ 101 పరుగులకే కుప్పకూలింది. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హాంప్‌షేర్‌ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 
చదవండి: డ్యాన్స్‌తో రచ్చ చేసిన చహల్‌ భార్య.. వీడియో వైరల్‌

ఆర్చర్‌ బనానా ఇన్‌స్వింగర్‌.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు