'డైరెక్టర్‌ గారూ.. ఫెదరర్‌కు, బాలీవుడ్‌ నటుడికి తేడా తెలియదా?'

17 Sep, 2022 11:20 IST|Sakshi

టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో జరగనున్న లెవర్‌ కప్‌ టోర్నీ ఫెదరర్‌కు ఆఖరిది కానుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత ఫెదరర్‌ పూర్తిగా ఆటకు దూరమవ్వనున్నాడు. ఫెదరర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన వేళ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అతనిపై ప్రశంసలు కురిపించారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఫెడ్డీ ఫోటోలు తప్ప ఇంకేం కనిపించలేదు. 

ఫెదరర్‌ రిటైర్మెంట్‌పై స్పందించిన బాలీవుడ్‌ డైరెక్టర్‌ హన్సల్‌ మెహతా కన్ఫూజ్‌ అయ్యాడు. ఫెదరర్‌కు విషెస్‌ చెబుతూ అతనికి బదులు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు.. నటుడు అర్బాజ్‌ ఖాన్‌ ఫోటో షేర్‌ చేశాడు. ''వి మిస్‌ యూ ఫెదరర్‌.. ఆల్‌ ది బెస్ట్‌ ఫర్‌ ఫ్యూచర్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే హన్సల్‌ మెహతా కన్ఫూజ్‌ కావడానికి ఒక కారణం ఉంది. దూరం నుంచి చూస్తే ఫెదరర్‌, అర్బాజ్‌ ఖాన్‌లు ఒకేలా కనిపిస్తారు. దాదాపు ఇద్దరి ముఖాలు ఒకేలా కనిపిస్తాయి. అందుకే హన్సల్‌ మెహతా కన్ఫూజ్‌ అయినట్లు తెలుస్తోంది.

ఇక హన్సల్‌ మెహతా ట్వీట్‌పై అభిమానులు వినూత్న కామెంట్స్‌ చేశారు. ''నాకు తెలిసి ఫెదరర్‌ గురించి ఇదే బెస్ట్‌ ట్వీట్‌.. ఫెదరర్‌కు, అర్బాజ్‌ ఖాన్‌కు తేడా తెలియడం లేదా.. '' అంటూ పేర్కొన్నారు. దర్శకుడు హన్స్‌ల్‌ మెహతా గురించి పరిచయం అక్కర్లేదు. స్కామ్‌ లాంటి సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేసింది ఈయనే. ఈ వెబ్‌ సిరీస్‌లో హర్షద్‌ మెహతా జీవిత చరిత్ర, షేర్‌ మార్కెట్‌లో లొసుగలు, మ్యాజిక్‌, జిమ్మిక్కులను హన్సల్‌ మెహతా తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.

చదవండి: ఫెదరర్‌ ఆస్తి విలువ ఎంతో తెలుసా?

'రిటైర్మెంట్‌ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ'

మరిన్ని వార్తలు