ఇంత దారుణమా.. క్రికెట్‌ను చంపేశాడు!

14 Jan, 2021 09:12 IST|Sakshi
హనుమ విహారి

బాబుల్‌ సుప్రియో వ్యతిరేక వ్యాఖ్య

ఒకే ఒక పదంతో జవాబిచ్చిన విహారి

బిహారి కాదు.. విహారి!

సిడ్నీ టెస్టులో జట్టును రక్షించేందుకు చివరి రోజున హనుమ విహారి చూపించిన పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. కండరాలు పట్టేసినా నొప్పిని భరిస్తూ అతను 161 బంతులు ఆడాడు. దీనిపై క్రికెట్‌ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది. అయితే కేంద్ర మంత్రి, మాజీ గాయకుడు బాబుల్‌ సుప్రియో మాత్రం ఒక వ్యతిరేక వ్యాఖ్యతో తన అసంతృప్తిని ప్రదర్శించాడు.

‘7 పరుగులు చేసేందుకు 109 బంతులా... ఇంత ఘోర ప్రదర్శనతో క్రికెట్‌ను చంపేసి భారత జట్టు చారిత్రక విజయం సాధించే అవకాశాన్ని హనుమ బిహారి పోగొట్టాడు. ఇది పెద్ద నేరం’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీనిపైనే ట్విట్టర్‌లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సుప్రియో అజ్ఞానాన్ని అంత తిట్టిపోశారు. అయితే విహారి దీనికి ఒకే ఒక పదంతో సమాధానం ఇచ్చాడు. ఇది బుధవారం సోషల్‌ మీడియాలో హోరెత్తిపోయింది.

తన పేరును తప్పుగా రాయడాన్ని చూపిస్తూ ‘హనుమ విహారి’ అంటూ భారత క్రికెటర్‌ ట్వీట్‌ చేశాడు. దీనికి సుమారు 61 వేల లైక్‌లు రాగా... సహచరుడు అశ్విన్‌ కూడా ROFL MAXX!! అంటూ పడిపడి దొర్లి నవ్వుతున్నట్లు ట్వీట్‌ చేశాడు. దీనికి 80 వేల లైక్‌లు వచ్చాయి. సెహా్వగ్‌ కూడా ‘ఒక్క విహారి అందరి లెక్క సరి చేశాడు’ అంటూ వ్యాఖ్యానించాడు.

చదవండి: స్మిత్‌వి అన్ని చిన్నపిల్లల బుద్ధులే

మరిన్ని వార్తలు