Dhaka Premier League: రెచ్చిపోయిన హ‌నుమ విహారీ.. సెంచరీ, హాఫ్‌ సెంచరీ సహా 216 పరుగులు..!

7 Apr, 2022 18:09 IST|Sakshi

Hanuma Vihari: 2022 ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయిన టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌, ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారీ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ (డీపీఎల్‌)లో రెచ్చిపోతున్నాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అబహాని లిమిటెడ్‌ తరఫున బరిలో ఉన్న విహారి.. ఈ వారం జరిగిన 3 మ్యాచ్‌ల్లో అజేయ సెంచరీ (43 బంతుల్లో 112 నాటౌట్‌), హాఫ్‌ సెంచరీ (23 బంతుల్లో 59) సహా 216 పరుగులు సాధించి, లీగ్‌ టాప్‌ స్కోరర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. 

డీపీఎల్‌లో విహారి సంచలన ప్రదర్శన గురించి తెలిసిన ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు.. ఇలాంటి ఆటగాడినా తాము నిర్లక్ష్యం చేసిందని తెగ బాధపడిపోతున్నాయి. మరోపక్క వరుస ఓటములతో నిరాశలో కూరుకుపోయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఎలాగైనా విహారిని ఒప్పించి ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఆడేలా చేయాలని ఆ జట్టు అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.    

కాగా, ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో 50 లక్షల బేస్‌ ప్రైజ్‌ విభాగంలో పేరు నమోదు చేసుకున్న విహారిని ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంతో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయాడు. దీంతో అతను ఐపీఎల్‌ జరిగే రెండు నెలల కాలాన్ని వృధా చేయకుండా ఢాకా ప్రీమియర్ లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. విహారితో సహా ఏడుగురు భారత ఆటగాళ్లు (అభిమన్యు ఈశ్వరన్, పర్వేజ్ రసూల్, బాబా అపరాజిత్, అశోక్ మెనరియా, చిరాగ్ జానీ, గురిందర్ సింగ్) డీపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐపీఎల్‌లో  24 మ్యాచ్‌లు ఆడిన విహారీ 14 స‌గ‌టుతో 284 ప‌రుగులు చేశాడు. 
చదవండి: ఐపీఎల్‌లో అవమానం.. విదేశీ లీగ్‌లో ఆడనున్న టీమిండియా ప్లేయర్లు

మరిన్ని వార్తలు