ఇలా చెమటోడ్చి ఎన్ని రోజులైందో...

6 Aug, 2020 00:43 IST|Sakshi

పూర్తిస్థాయి జిమ్‌ సెషన్‌ పట్ల పీవీ సింధు హర్షం

హైదరాబాద్‌: నాలుగు నెలల తర్వాత జిమ్‌లో శ్రమించడం పట్ల ప్రపంచ చాంపియన్, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సంతోషం వ్యక్తం చేసింది. అన్‌లాక్‌– 3 మార్గదర్శకాల్లో భాగంగా ఆగస్టు 5 నుంచి వ్యాయామశాలలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో... సింధు బుధవారం జిమ్‌లో చెమటోడ్చింది. పూర్తిస్థాయి జిమ్‌ సెషన్‌లో పాల్గొన్న ఆమె ట్విట్టర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది.

చాలా కాలం తర్వాత ఇలా కసరత్తులు చేయడం ఆనందంగా ఉందని పేర్కొంది. ట్రైనర్‌ సహాయంతో బరువులు ఎత్తడం, స్ట్రెచింగ్‌ వంటి వ్యాయామాలు చేసింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలకు అంతరాయం ఏర్ప డిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) సెప్టెంబర్‌లో జరగాల్సిన నాలుగు టోర్నీలను రద్దు చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు