ఇర్ఫాన్‌ వ్యాఖ్యల్ని 1000000 శాతం సమర్థిస్తా

4 Oct, 2020 11:27 IST|Sakshi

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల విరామం తర్వాత మైదానంలో అడుగుపెట్టిన సీఎస్‌కే నుంచి అభిమానులు ఏదో ఆశించినా.. వారు తమ ప్రణాళికల్ని ఉపయోగించుకోవడంలో మరోసారి విఫలమయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని 47 పరుగులతో నౌటౌట్‌గా నిలిచినప్పటికీ వికెట్ల మధ్య పరుగులు తీయడానికి కాస్తంత ఇబ్బంది పడ్డాడు.

దుబాయ్‌లో వాతావరణం ఎక్కువగా పొడి ఉండటం వలనే ఈ పరిస్థితిని ఎదుర్కొవాల్సి వచ్చిందని ధోనీ వివరణ కూడా ఇచ్చాడు. అయితే ఈ విషయంలో భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, ధోని పేరు ప్రస్తావించకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తూ 'వయసు అనేది కొందరికి సంఖ్య మాత్రమే, అయితే అదే మరికొందరు తొలగించబడటానికి ఒక కారణమవుతుంది' అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై తాజాగా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మద్దతు పలుకుతూ.. 'ఇర్ఫాన్‌ పఠాన్‌ వ్యాఖ్యలతో నేను 10,00,000 శాతం  అంగీకరిస్తాను' అంటూ ట్వీట్‌ చేశారు.  (వైరల్‌: ధోని వయసును విమర్శిస్తూ ఇర్ఫాన్‌ ట్వీట్‌)

కాగా.. ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన చెన్నై జట్టు మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. ధోని కూడా తన మార్క్‌ ఆటతీరును ప్రదర్శించలేక పోతున్నాడు. దీంతో ఇప్పుడు ధోని ఫిట్‌నెస్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ధోని చివరి వరకూ క్రీజ్‌లో ఉంటే గెలుపు తథ్యం అనే భరోసా ఉండేది. కానీ ఇప్పడా పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 164 పరుగులు చేయగా.. సీఎస్‌కే బ్యాట్‌మన్ విఫలమవ్వడంతో 7 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. (అప్పుడు ట్రోల్‌ చేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నారా!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు