IPL 2022: 'అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.. భారత జట్టులో తిరిగి రావడం ఖాయం'

11 Apr, 2022 18:09 IST|Sakshi
Courtesy: IPL Twitter

గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాపై భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్ సింగ్‌ ప్రశంశల వర్షం కురిపించాడు. ఓ కొత్త జట్టును హార్ధిక్‌ తన నాయకత్వ లక్షణాలతో ముందుకు నడిపిస్తున్నాడు అని అతడు కొనియాడాడు. కాగా ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోను గుజరాత్‌ విజయం సాధించింది.

"హార్ధిక్‌ పాండ్యా కెప్టెన్‌గా అద్భుతంగా జట్టును ముందు నడిపిస్తున్నాడు. అదే విధంగా అతడు బ్యాట్‌తో కూడా రాణిస్తున్నాడు. ముఖ్యంగా హార్ధిక్‌ బౌలింగ్‌ చేయడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మరో వైపు అతడు బౌలింగ్‌ చేయడం టీమిండియాకు కూడా శుభ పరిణామం అనే చెప్పుకోవాలి. అతడు ఐపీఎల్‌లో బాగా రాణిస్తే జాతీయ జట్టులో మళ్లీ పునరాగమనం చేయవచ్చు. కాగా హార్ధిక్‌ కూడా భారత్‌ జట్టులోకి తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

అతడు క్రమం తప్పకుండా బౌలింగ్‌ చేయగల్గితే కచ్చింతంగా భారత జట్టులోకి వస్తాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా వేదికగా జరగున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు సరైన ఆల్‌రౌండర్‌ కావాలి" అని హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు. ఇక ఏప్రిల్‌ 11న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనుంది.

చదవండి: IPL 2022: అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన చాహల్‌.. వీడియో వైరల్‌!

మరిన్ని వార్తలు