Shoaib Akhtar: షోయబ్‌ అక్తర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన హర్భజన్ సింగ్

26 Dec, 2021 13:06 IST|Sakshi

Shoaib Akhtars mothers demise: పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్తర్‌ తల్లి అనారోగ్యంతో ఆదివారం మరణించింది. ఈ విషయాన్ని అతడు ట్విటర్‌ వేదికగా తెలిపాడు. పాకిస్తాన్‌ మీడియా కథనాలు ప్రకారం.. షోయబ్‌ తల్లి ఆరోగ్యం క్షీణిచడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందూతూ మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు ఇస్లామాబాద్‌లో జరగనున్నాయి. కాగా అక్తర్‌ తల్లి మృతికి టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్, షోయబ్ మాలిక్‌తో పాటు పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు.

"ఈ క్లిష్ట సమయంలో మీకు అల్లా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని  భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఆమె కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని హర్భజన్ సింగ్ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

చదవండి: Vijay Hazare Trophy Final: అర్ధ సెంచరీతో మెరిసిన దినేష్‌ కార్తీక్‌..

మరిన్ని వార్తలు