హార్దిక్‌ షాట్‌కు ఐసీసీ ఫిదా.. ఏమని పిలవాలి?

13 Mar, 2021 19:46 IST|Sakshi

దుబాయ్‌: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. బ్యాటింగ్‌లో వైఫల్యంగా కారణంగా టీమిండియా మూల్యం చెల్లించుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌(67) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. దాంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 124 పరుగులకే పరిమితం కాగా, ఆపై లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 15.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.  ఇక్కడ చదవండి : ఆ రూల్‌ నీకు కూడా వర్తిస్తుందా.. కోహ్లిపై ధ్వజమెత్తిన వీరూ

కాగా, టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కొట్టిన షాట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)సైతం ఫిదా అయ్యింది.  ఇదొక అసాధారణమైన షాట్‌ కావడంతో దాన్ని ప్రత్యేకంగా తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. అంతేకాకుండా ఈ షాట్‌కు పేరు పెట్టాలని అభిమానులకు సవాల్‌ విసిరింది. ‘హార్దిక్‌ కొట్టిన ఈ షాట్‌కు పేరు పెట్టండి’ అంటూ అభిమానుల్ని అడిగింది.

వివరాల్లోకి వెళితే..  టీమిండియా ఇన్నింగ్స్‌ ఆడేటప్పుడు బెన్‌ స్టోక్స్‌ వేసిన 15వ ఓవర్‌లో హార్దిక్‌ ఓ బంతిని ఫోర్‌ కొట్టాడు.  స్టోక్స్‌ షార్ట్‌ పిచ్‌ బంతి వేయగా, దాన్ని కట్‌ షాట్‌ రూపంలో బౌండరీకి తరలించాడు.  తన శరీరాన్ని దాదాపు నేలగా ఆన్చి మరీ హార్దిక్‌ బంతిని ఫ్లిక్‌ చేశాడు. ఆ బంతిని కచ్చితంగా చూడకపోయినప్పటికీ కేవలం  టైమింగ్‌తోనే దాన్ని ఫోర్‌గా మలచాడు. దీనికి సంబంధించిన ఫోటోను ఐసీసీ షేర్‌ చేస్తూ  ‘ ఈ షాట్‌ను ఏమని పిలవాలి’ అనే సందిగ్థతను వ్యక్తం చేసింది.

అదే సమయంలో ఆ షాట్‌కు పేరును అభిమానులకే వదిలేసింది. అయితే దీనికి అభిమానులు బాగానే రియాక్ట్‌ అవుతున్నారు. ‘ ద సోఫా’ షాట్‌ పెట్టమని ఒకరు రిప్లే ఇస్తే, ‘ ద మ్యాట్రిక్స్‌ షాట్‌’ అని మరొక అభిమాని బదులిచ్చాడు. ఇది పాండ్యా స్కూప్‌ అని మరొకరు పేర్కొన్నారు.  ‘హార్దిక్‌కట్‌’ అని మరొకరు పేరు పెట్టగా,  ఇక్కడ హార్దిక్‌ గ్రౌండ్‌కు దాదాపు తాకినంత పనిచేసే ఆ షాట్‌ కొట్టాడు కాబట్టి ‘పారలెల్‌ గ్రౌండ్‌ షాట్‌’ అని పెట్టాలని మరొకరు సూచించారు. ఇలా ఆ షాట్‌పై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు అభిమానులు. ఇక్కడ చదవండి: బుమ్రా ఆన్‌ ఫీల్డ్‌ మూడ్‌..  నా డైలీ మూడ్‌ ఒకేలా!

>
మరిన్ని వార్తలు