IND vs ENG: 'ఇదేం నాకు ప్రత్యేకమైన రోజు కాదు.. నా కష్టానికి ప్రతిఫలం దక్కిందంతే'

8 Jul, 2022 17:29 IST|Sakshi

సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ ఆల్‌ రౌండర్‌  హార్థిక్‌ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత విజయంలో తన ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో పాండ్యా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో 51 పరుగులతో అదరగొట్టిన పాండ్యా.. అనంతరం బౌలింగ్‌లోనూ నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా తన టీ20 కెరీర్‌లో హార్ధిక్‌కు ఇదే తొలి ఆర్ధసెంచరీ కావడం గమనార్హం. ఇక మ్యాచ్‌ అనంతరం బీసీసీఐ టీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలి టీ20లో తన అనుభవాన్ని ఇషాన్ కిషన్‌తో హార్థిక్‌  పంచుకున్నాడు.

"ఇదేం నాకు ప్రత్యేకమైన రోజు కాదు. జీవితంలో ఒక సాధారణ రోజులా అనిపిస్తుంది. అయితే ఇన్నాళ్లు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఈ మ్యాచ్‌లో 90.5 కి.మీ వేగంతో బౌలింగ్‌ చేయడం సంతోషంగా ఉంది. జట్టు కోచింగ్‌ స్టాప్‌ కృషి వల్లే నేను ఈ స్పీడ్‌తో బౌలింగ్‌ చేయగలిగాను. కాబట్టి ఈ క్రెడిట్‌ మొత్తం సహాయక సిబ్బందికే దక్కాలి. ముఖ్యంగా సోహమ్ దేశాయ్, హర్ష ఇంగ్లండ్‌ సిరీస్‌కు మమ్మల్ని సిద్ధం చేయడంలో చాలా కష్టపడ్డారు" అని హార్ధిక్‌ పాండ్యా పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: 'టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ వద్దు.. కోహ్లిని పంపండి'

>
మరిన్ని వార్తలు