Hardik Pandya: హార్ధిక్‌ పాండ్యా నాన్నమ్మనూ వదలని "పుష్ప" ఫోబియా.. తగ్గేదేలే అంటున్న బామ్మ

26 Jan, 2022 16:57 IST|Sakshi

Hardik Pandya And His Nani Dancing For Pushpa Srivalli Step: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పాన్‌ ఇండియా మూవీ "పుష్ప" కేవలం సినిమా ప్రపంచాన్నే కాకుండా యావత్‌ జగత్తును ఉర్రూతలూగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశ, విదేశాలకు చెందిన సామాన్యుల దగ్గరి నుండి సినిమా స్టార్లు, సెలబ్రిటీలు, స్టార్‌ క్రికెటర్లు.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరికి ప్రస్తుతం పుష్ప ఫోబియా పట్టుకుంది. ఈ సినిమాలోని పాటలు, డైలాగులు, డ్యాన్సులకు ఫిదా అయిన జనం.. సందర్భంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ తమ టాలెంట్‌కి పని చెబుతూ సరదా తీర్చుకుంటున్నారు. 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

ఇంతటితో ఆగకుండా వారు చేసిన డ్యాన్సులు, ఇమిటేట్‌ చేసిన డైలాగులను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి సంబరపడిపోతున్నారు. తాజాగా, ఓ బామ్మ సైతం తాను కూడా తగ్గేదేలేదంటూ పుష్పలోని శ్రీవల్లి సాంగ్‌ను చిందేసింది. ఈ హడావుడి చేసిన ముసలావిడ ఎవరో అనామకురాలనుకుంటే పొరపాటే. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా నాన్నమ్మ అయిన ఈ బామ్మ.. వయసు సహకరించకపోయినా ఎంతో ఉత్సాహంతో పాటకు స్టెప్పేసింది. ఆమె పక్కనే హార్ధిక్‌ పాండ్యా కూడా ఉన్నాడు. "అవర్‌ ఓన్‌ పుష్ప నాని" అంటూ హార్ధిక్‌ ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌ జోడించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతోంది. నెటిజన్లు బామ్మ డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు.   
చదవండి: వికెట్ ప‌డ‌గొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు

మరిన్ని వార్తలు