హార్ధిక్‌ పాండ్యా రిస్ట్‌ వాచ్‌ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

25 Aug, 2021 18:37 IST|Sakshi

ముంబై: ఐపీఎల్ పుణ్యమా అని రాత్రికిరాత్రి స్టార్లుగా మారిపోయిన క్రికెటర్లలో పాండ్యా సోదరులు(హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య) ముందువరుసలో ఉంటారు. వీరిద్దరూ రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాండ్యా సోదరులు ముంబై ఇండియన్స్ జట్టులో చేరడంతో వారి లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోయింది. లగ్జరీ ఫ్లాట్లు, విలాసవంతమైన జీవన శైలి, విలువైన కార్లు, బ్రాండెడ్‌ వస్తువులకు లెక్కే లేదు. 

తాజాగా, పాండ్యా సోదరుల్లో చిన్నవాడైన హార్ధిక్‌ పాండ్య కళ్లు బైర్లు కమ్మే రేట్‌ ట్యాగ్‌ ఉన్న రిస్ట్‌ వాచ్‌ని సొంతం చేసుకుని మరోసారి వార్తల్లోకెక్కాడు. హార్ధిక్‌.. పటేక్ ఫిలిప్పీ నాటిలస్ ప్లాటినమ్ 5711 అనే బ్రాండెడ్‌ వాచ్‌ను కొనుగోలు చేశాడు. ఈ వాచీ డయల్ చుట్టూ అత్యంత అరుదైన 32 పచ్చ మరకత రాళ్లను అమర్చారు. వాచ్ మొత్తం ప్లాటినంతో తయారైంది. దీని ధర రూ.5 కోట్ల పైమాటే అంటే నమ్మగలరా. ఇది నిజం. ఇది 5711 రేంజ్ అరుదైన వాచ్‌. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచీల్లో ఇదొకటి. ఈ వాచ్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని హార్ధిక​  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. 
చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి దూసుకొచ్చిన పాక్‌ బౌలర్‌

మరిన్ని వార్తలు