స్విమ్మింగ్‌ పూల్‌లో అగస్త్యతో హార్ధిక్‌ పాండ్యా ..

10 Feb, 2021 19:03 IST|Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్య, అతని ముద్దుల కొడుకు అగస్త్యతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ మారాయి. హార్ధిక్‌, నటాషా దంపతులకు అగస్త్య గతేడాది మే 30న జన్మించాడు. నాటి నుంచి అగస్త్యకు సంబంధించిన ప్రతి ఫోటో సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తుంది. తాజాగా, హార్ధిక్‌ పాండ్యా అతని కొడుకు అగస్త్యతో కలిసి స్విమ్మింగ్‌ పూల్‌ ఆడుకుంటున్న చిత్రాన్ని అతని భార్య నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

స్విమ్మింగ్‌పూల్‌లో అగస్త్య తొలిసారిగా అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఈ ఫోటోతో పాటు వీరి కుటుంబానికి సంబంధించిన మరో మూడు ఫోటోలను అమె సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, పాండ్యా గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ తరువాత జరిగిన ఆసీస్‌ పర్యటనలో చివరి సారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 
చదవండి: ఐదుకు పడిపోయిన విరాట్‌ టెస్ట్‌ ర్యాంకింగ్‌‌

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు