Hardik Pandya - Ravi Shastri: 'ప్రపంచకప్‌ తర్వాత వన్డేలకు హార్దిక్ గుడ్‌ బై చెప్పడం ఖాయం’

24 Jul, 2022 07:59 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యాపై భారత మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత పాండ్యా వన్డేల నుంచి తప్పుకునే అవకాశం ఉందని రవిశాస్త్రి తెలిపాడు. భవిష్యత్తులో ఆటగాళ్ళు వన్డే ఫార్మాట్‌ కంటే టీ20 ఫార్మాట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ అనూహ్యంగా వన్డేల నుంచి తప్పుకుని అందరనీ షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో ఆడటం తనకు చాలా కష్టంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టోక్స్‌ తెలిపాడు.

ఈ క్రమంలో ఆటగాళ్లు బిజీ బీజీ షెడ్యూల్స్‌ వల్ల తీవ్రమైన ఒత్తిడి ఎదర్కొంటున్నారని, ఐసీసీ తమ షెడ్యూల్‌ను సవరించాలని మాజీలు, క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయంపై రవిశాస్త్రి మాట్లాడుతూ.. "‘వన్డేలు, టీ20లు కంటే టెస్టు క్రికెట్ చాలా ప్రత్యేకమైనది. కానీ టెస్టు క్రికెట్‌ రోజు రోజుకి ఆదరణ కోల్పోతోంది. ఇక ఇప్పటికే ఆటగాళ్లు వారు ఏ ఫార్మాట్‌లలో ఆడాలో నిర్ణయించుకున్నారు. హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే.. అతడు ఎక్కువగా టీ20 క్రికెట్‌ ఆడాలను క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు. అతడు ఇదే విషయాన్ని చాలా సార్లు స్పష్టంగా చెప్పాడు.

వచ్చే ఏడాది భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. ఆ తర్వాత అతడు వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పవచ్చు. జట్టులో మరి కొంత మంది ఆటగాళ్లు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆటగాళ్లు టీ20 క్రికెట్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆదరణ పెరుగుతోంది. ఫ్రాంచైజీ క్రికెట్‌పై ఆటగాళ్లు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. వారిని ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడకుండా మనం ఆపలేం. కాబట్టి ద్వైపాక్షిక సిరీస్‌లను తగ్గించి, ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించేలా ప్రయత్నం చేయాలి" అని అతడు పేర్కొన్నాడు.
చదవండిScott Styris On Shreyas Iyer: టీమిండియా తదుపరి కెప్టెన్‌ అతడే! ఆ ఒక్క బలహీనత అధిగమిస్తే..

మరిన్ని వార్తలు