కొడుకుతో దిగిన ఫోటోను షేర్‌ చేసిన హార్దిక్‌

1 Aug, 2020 13:36 IST|Sakshi

ముంబై : భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా, తన గర్ల్‌ఫ్రెండ్‌, సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిక్‌కు ఇటీవల పండంటి బాబు జన్మించిన విషయం తెలిసిందే. కుమారుడి చేతిని పట్టుకున్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఈ విషయాన్ని హార్థిక్‌ పాండ్యా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. తాజాగా తన చిన్నారి కొడుకును ప్రేమతో చేతుల్లోకి తీసుకొని ఆనందంగా చూస్తున్న ఫోటోను శనివారం అభిమానులతో పంచుకున్నాడు. ‘దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో హార్దిక్‌కు ప్రముఖులు, క్రికెటర్స్‌, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అనేకమంది హార్దిక్‌ పోస్టుకు లైకులు, కామెంట్‌లు చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. (తండ్రైన హార్దిక్‌ పాండ్యా..)

కాగా జనవరి 1న  నటాషాతో నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్‌.. మే 31న తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి నటాషా, తనకు చెందిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వస్తున్నాడు. అయితే పెళ్లి కాకుండానే తండ్రి అయిన భారత క్రికెటర్‌పై కొంత మంది మండిపడ్డారు. అయినప్పటికీ హార్దిక్‌ దీనిపై స్పందించలేదు. ఇదిలా ఉండగా నటాషాతో ప్రేమ గురించి హార్దిక్ పాండ్యా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఒక పార్టీలో అర్ధరాత్రి సమయంలో నేను టోపీ, చైన్, వాచ్‌తో కనిపించడాన్ని చూసిన నటాషా.. ఈ వింత మనిషి ఎవరని అనుకుందట. నేను ఎవరో అప్పటి వరకూ నటాషాకి తెలియదు. తనతో మాట్లాడిన తర్వాతే.. ఒకరి గురించి మరొకరం తెలుసుకున్నాం. ఆ వెంటనే డేటింగ్, ఎంగేజ్‌మెంట్ జరిగిపోయాయి. అని హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. ('ఎన్ని వైర‌స్‌లు వ‌చ్చినా మేం భయ‌ప‌డం')

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు