క్యాట్‌వాక్‌తో దుమ్మురేపిన క్రికెటర్‌ భార్య; వీడియో వైరల్‌

27 Jun, 2021 20:10 IST|Sakshi

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్‌ క్యాట్‌వాక్‌తో దుమ్మురేపింది. గర్ల్‌ గ్యాంగ్‌ 'వాసాబి' పాటకు హాట్‌ లుక్స్‌​ఇస్తూ క్యాట్‌వాక్‌ చేసిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో పసుపు పచ్చ డ్రెస్‌ వేసుకొని.. బ్లాక్‌ కలర్‌ కోటుతో.. తలపై టోపితో స్టన్నింగ్‌ లుక్స్‌తో తన అభిమానులను ఫిదా చేసింది. ఇన్‌స్టాలో దాదాపు 3.1 మిలియన్‌ ఫాలోవర్లు కలిగిన ఆమెకు వ్యూస్‌ పరంగా ఇదే హయ్యస్ట్‌ కావడం విశేషం. వీలైతే మీరు ఒక లుక్కేయండి. హార్దిక్‌ పాండ్యా నటాషా క్యాట్‌వాక్‌కు కాంప్లిమెంట్స్‌ ఇస్తూ హార్ట్‌, లాఫింగ్‌ ఎమోజీని జత చేశాడు.

ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికకాని హార్దిక్‌ పాండ్యా లంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు సన్నద్దమవుతున్నాడు. శిఖర్‌ ధావన్‌ సారధ్యంలోని టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను జూలై 13న ఆడనుంది. కాగా హార్దిక్‌ తన సోదరుడు కృనాల్‌తో కలిసి ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా కరోనా కారణంగా వాయిదా పడిన మిగిలిన సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. 

చదవండి: '17 అయితే 28 గా చూపించారు.. ఏం తాగి వచ్చారా?'

‘ఎన్ని గెలిచి ఏం లాభం, ఒక్కసెషన్‌ టీమిండియా కొంపముంచింది’

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు