హర్దిక్‌ స్థానంలో జయంత్‌ యాదవ్‌

31 Oct, 2020 15:12 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యా(ఫైల్‌ఫోటో)

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న రెండో అంచె మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై తాత్కాలిక కెప్టెన్‌ కీరోన్‌ పొలార్డ్‌ ముందుగా ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఓవరాల్‌గా ఇరుజట్లు 25సార్లు ముఖాముఖి పోరులో తలపడగా ముంబై 13సార్లు, ఢిల్లీ 12 సార్లు విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతినిచ్చింది. అతని స్థానంలో జయంత్‌ యాదవ్‌కు చోటు కల్పించింది. ఇక పాటిన్సన్‌ స్థానంలో కౌల్టర్‌నైల్‌ జట్టులోకి వచ్చాడు. ఢిల్లీ జట్టు మూడు మార్పులు చేసింది. ప్రవీణ్‌ దూబేను తుది జట్టులోకి తీసుకోవడంతో అతని ఐపీఎల్‌ అరంగేట్రం షూరూ అయ్యింది. పృథ్వీషా, హర్షల్‌ పటేల్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు. (ఆర్సీబీ వదులుకుంది.. ఢిల్లీ తీసుకుంది)

ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ ఆడిన తన చివరి ఐదు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో గెలవగా, మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ముంబై ఇండియన్స్‌ గత ఐదు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో గెలిచి రెండింట ఓటమి పాలైంది. ప్రధానంగా ముంబై తన ఫామ్‌ను కొనసాగిస్తుండగా, ఢిల్లీ ఫామ్‌లేమితో సతమతమవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించింది. ముంబై 12 మ్యాచ్‌లకు గాను ఎనిమిది విజయాలు నమోదు చేసి 16 పాయింట్లతో ఉంది. ముంబై టాప్‌ ప్లేస్‌లో ఉండగా, ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరగా, ఢిల్లీ ఈ మ్యాచ్‌ గెలిస్తే ప్లే ఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకుంటుంది. 

ముంబై జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో డీకాక్‌(392), సూర్యకుమార్‌ యాదవ్‌(362), ఇషాన్‌ కిషన్‌(323)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ముంబై బౌలింగ్‌ విభాగంలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో బుమ్రా(20), ట్రెంట్‌ బౌల్ట్‌(17), రాహుల్‌ చాహర్‌(14)లు వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు.ఢిల్లీ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో శిఖర్‌ ధావన్‌(471), శ్రేయస్‌ అయ్యర్‌(389), రిషభ్‌ పంత్‌(253)లు టాప్‌ ఫెర్ఫార్మర్స్‌గా ఉండగా, అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో కగిసో రబడా(23), అన్రిచ్‌ నోర్జ్‌)15), రవిచంద్రన్‌ అశ్విన్‌(9) వరుస మూడు స్థానాల్లో ఉన్నారు. (‘టాప్‌ మోస్ట్‌ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు’)

ఢిల్లీ
శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌, హెట్‌మెయిర్‌, స్టోయినిస్‌, హర్షల్‌ పటేల్‌, ప్రవీణ్‌ దూబే, రబడా, రవిచంద్రన్‌ అశ్విన్‌, నోర్జే

ముంబై
కీరోన్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), డీకాక్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరవ్‌ తివారీ, కృనాల్‌ పాండ్యా, జయంత్‌ యాదవ్‌, కౌల్టర్‌ నైల్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా

మరిన్ని వార్తలు