పతాకధారులుగా హర్మన్‌ప్రీత్‌ సింగ్, లవ్లీనా

21 Sep, 2023 01:13 IST|Sakshi

ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి పతాకధారులగా పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్, మహిళా స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైన్‌ వ్యహరించనున్నారు. ఈనెల 23న చైనాలోని హాంగ్జూ నగరంలో ఆసియా క్రీడలకు తెర లేవనుంది. అస్సాంకు చెందిన 25 ఏళ్ల లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం, ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. పంజాబ్‌కు చెందిన హర్మన్‌ భారత్‌ తరఫున 191 మ్యాచ్‌లు ఆడి 155 గోల్స్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు