Harry Brook: 125 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌

18 Dec, 2022 16:40 IST|Sakshi

ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ సూపర్‌ ఫామ్‌ కనబరుస్తున్నాడు. ఇటీవలే పాకిస్తాన్‌తో ప్రారంభమైన టెస్టు సిరీస్‌లో బ్రూక్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా పాక్‌తో మొదలైన మూడో టెస్టులో మరోసారి సెంచరీతో మెరిసిన హ్యారీ బ్రూక్‌ 125 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. తొలి ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా హ్యారీబ్రూక్‌ నిలిచాడు.

ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన బ్రూక్‌ ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 480 పరుగులు(12, 153, 87, 9, 108,111) చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. మరో విషయమేంటంటే బ్రూక్‌ సాధించిన ఆ మూడు సెంచరీలు పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లోనే వచ్చాయి. ఇంతకముందు ఇంగ్లండ్‌ తరపున కేఎస్‌ రంజిత్‌సింగ్హ్జి 418 పరుగులు( 62, 154*, 8, 11, 175,8*), టిప్‌ ఫోస్టర్‌ 411 పరుగులు(287, 19,49*, 21, 16,19)లు ఉన్నారు. తాజాగా వీరిద్దరిని అధిగమించిన హ్యారీ బ్రూక్‌ 480 పరుగులతో టాప్‌ స్థానంలో నిలిచాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే మూడో టెస్టులో ఇంగ్లండ్‌ రెండో రోజు జరుగుతున్న ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. బెన్‌ ఫోక్స్‌ 60, మార్క్‌వుడ్‌ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌట్‌ అయింది.

చదవండి: చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్‌ కోసం

బంగ్లాపై టీమిండియా విజయం.. విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు

మరిన్ని వార్తలు