అఫ్ఘనిస్తాన్‌ తరఫున తొలి టెస్టు క్రికెటర్‌గా

12 Mar, 2021 09:59 IST|Sakshi

అబుదాబి: హష్మతుల్లా షాహిది అఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. జింబాబ్వేతో జరుగుతోన్న రెండో టెస్టులో అజేయ డబుల్‌ సెంచరీ (443 బంతుల్లో 200 నాటౌట్‌; 21 ఫోర్లు, 1 సిక్స్‌) సాధించడం ద్వారా అఫ్ఘనిస్తాన్‌ తరఫున టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. అతడితో పాటు కెపె్టన్‌ అస్గర్‌ అఫ్గాన్‌ కూడా శతకం (257 బంతుల్లో 164; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాదడంతో... ఓవర్‌నైట్‌ స్కోరు 307/3తో రెండో రోజు ఆట కొనసాగించిన అఫ్ఘనిస్తాన్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 545 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. హష్మతుల్లా, అస్గర్‌ నాలుగో వికెట్‌కు 307 పరుగులు జోడించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే గురువారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్‌నష్టపోకుండా 50 పరుగులు చేసింది.   
చదవండి: పొలార్డ్‌ క్షమాపణలు చెప్పాడు..

తొలి వన్డేలో వెస్టిండీస్‌ విజయం 


నార్త్‌సౌండ్‌: వికెట్‌ కీపర్‌ షై హోప్‌ సెంచరీ (133 బంతు ల్లో 110; 12 ఫోర్లు, 1 సిక్స్‌)కి ఎవిన్‌ లూయిస్‌ బాధ్యతాయుత బ్యాటింగ్‌ (65) తోడవ్వడంతో శ్రీలంకతో ఆరంభమైన వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధ రాత్రి దాటాక ముగిసిన తొలి వన్డేలో విండీస్‌ జట్టు 8 వికెట్లతో శ్రీలంకపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది.  దనుష్క గుణతిలక (55), దిముత్‌ కరుణరత్నే (52), ఆషెన్‌ బండార (50) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 47 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసి గెలిచింది.‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షై హోప్, లూయిస్‌ తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించి విండీస్‌కు శుభారం భం అందించారు. చివర్లో డారెన్‌ బ్రావో (37 నాటౌట్‌) రాణించడంతో విండీస్‌కు విజయం దక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే నేడు జరుగుతుంది.

చదవండి: 2025లోనా.. ఇంకెవరు నేనే ఉంటా: జడేజా

మరిన్ని వార్తలు