అజారుద్దీన్‌ ఒక డిక్టేకర్‌లా వ్యవహరిస్తున్నాడు

20 Jun, 2021 12:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత మాజీ క్రికెటర్‌, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌ ఒక డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నాడని హెచ్‌సీఏ మాజీ సెక్రటరీ శేష్‌ నారాయన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '' హెచ్‌సీఏను అజారుద్దీన్‌ భ్రష్టు పట్టిస్తున్నాడు. అజారుద్దీన్‌కు అందరినీ కలుపుకొనిపోయే తత్వం లేదు. హెచ్‌సీఏపై బీసీసీఐ కలగజేసుకునే రోజులు వస్తాయి'' అంటూ ఆయన పేర్కొన్నాడు.

యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్‌ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్‌సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్‌మన్‌ ని యామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్‌సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ అజారుద్దీను అధ్యక్ష పదవి నుంచి తొలగించింది.
చదవండి: అజహరుద్దీన్‌పై వేటు!

వాళ్ల అవినీతి బయటపడుతుందనే నన్ను తొలగించారు: అజారుద్దీన్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు