Commonwealth Games 2022: ‘కామన్వెల్త్‌’కు తేజస్విన్‌! 

25 Jun, 2022 11:16 IST|Sakshi

న్యూఢిల్లీ: హైజంపర్‌ తేజస్విన్‌ శంకర్‌ను భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ క్రీడలకు ఎంపిక చేసింది. కోర్టు సూచన మేరకు అమెరికాలో కళాశాల క్రీడల్లో కనబరిచిన అతని ప్రదర్శనను ఏఎఫ్‌ఐ గుర్తించింది. అర్హత ప్రమాణం (2.27 మీ.) పూర్తి చేసిన తేజస్విన్‌ను బర్మింగ్‌హామ్‌ పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

తేజస్విన్‌తోపాటు ఆసియా క్రీడల స్వర్ణ విజేత స్వప్న బర్మన్‌ (హెప్టాథ్లాన్‌), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మారథాన్‌ రన్నర్‌ శ్రీను బుగత, అనిశ్‌ థాపా, రిలే రన్నర్‌ జిల్నాలను కూడా ఎంపిక చేశారు. అయితే ఈ ఐదుగురి పేర్లను భారత ఒలింపిక్‌ సంఘం ఆమోదిస్తేనే వీరికి కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే వీలుంటుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వాహకులకు తుది జాబితాను ఈనెల 30లోపు పంపించాలి.
చదవండి: ENG vs NZ: టెస్టుల్లో బెన్‌ స్టోక్స్‌ అరుదైన ఫీట్‌.. తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిగా..!

మరిన్ని వార్తలు